Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Khanapur Municipal Election | ఖానాపూర్ మున్సిపల్‌ పీఠం బీజేపీ కైవసం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆదిలాబాద్ - Khanapur Municipal Election | ఖానాపూర్ మున్సిపల్‌ పీఠం బీజేపీ కైవసం

ఆదిలాబాద్తెలంగాణ

Khanapur Municipal Election | ఖానాపూర్ మున్సిపల్‌ పీఠం బీజేపీ కైవసం

ఖానాపూర్​ మున్సిపల్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ కౌన్సిలర్​ అంకం మౌనిక ఛైర్​పర్సన్​గా ఎన్నికయ్యారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 5, 2026 1:37 సా.
Srinivas Kolluri
17 గంటలు ago
Share
Khanapur Municipal Election

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Khanapur Municipal Election | నిర్మల్​ జిల్లా ఖానాపూర్​ మున్సిపల్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. బీఆర్​ఎస్​ మద్దతుతో కమలం పార్టీ కౌన్సిలర్​ అంకం మౌనిక ఛైర్​పర్సన్​గా ఎన్నికయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరిలో మున్సిపలు ఎన్నికలు (Municipal Elections) జరిగిన విషయం తెలిసిందే. అదేనెల 16న మున్సిపల్ ఛైర్మన్​, వైస్​ ఛైర్మన్​ ఎన్నికలు నిర్వహించారు. అయితే హంగ్​ వచ్చిన కొన్ని చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాటికి ఫిబ్రవరి 17న ఎన్నికలు నిర్వహించారు. అయితే మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, నిర్మల్​ జిల్లా ఖానాపూర్​లో మాత్రం మళ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. వీటిలో క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపల్​ ఛైర్​పర్సన్​ ఎన్నిక శనివారం పూర్తయింది. ఖానాపూర్​లో సైతం ఎన్నికలు నిర్వహించగా.. కాంగ్రెస్​ సభ్యులు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు (Vedma Bojju) ఆందోళనతో అధికారులు వాయిదా వేశారు.

Khanapur Municipal Election | వీడిన ఉత్కంఠ

అధికారులు ఆదివారం ఖానాపూర్​ మున్సిపల్ ఛైర్​పర్సన్ ఎన్నిక నిర్వహించారు. పలుమార్లు వాయిదా పడిన ఎన్నిక ఎట్టకేలకు పూర్తి కావడంతో ఉత్కంఠ వీడింది. బీజేపీ కౌన్సిలర్​ అంకం మౌనిక ఛైర్​పర్సన్​గా ఎన్నిక కాగా.. బీఆర్​ఎస్​కు చెందిన మహమ్మద్ షోయబ్ వైస్​ ఛైర్మన్​గా గెలిచారు.

బల్దియాలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ఎన్నికల్లో బీఆర్​ఎస్​ 4, బీజేపీ 4, కాంగ్రెస్​ 3, ఒక చోట ఇండిపెండెంట్​ అభ్యర్థి గెలిచారు. స్వతంత్ర అభ్యర్థి, ఎక్స్‌ అఫీషియో ఓటుతో కాంగ్రెస్‌ బలం ఐదుకు చేరింది. దీంతో ఎలాగైనా మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్​ యత్నించింది. అయితే బీఆర్ఎస్​, బీజేపీ కలిసి పదవులను పంచుకున్నాయి. బీజేపీ ఛైర్​పర్సన్​ పదవి తీసుకోగా.. వైస్​ ఛైర్మన్​గా బీఆర్​ఎస్​ కౌన్సిలర్​ను ఎన్నుకున్నారు. శనివారం రెండు చోట్ల జరిగిన ఎన్నికల్లో బీఆర్​ఎస్​ గెలుపొందగా.. తాజాగా బీజేపీ మున్సిపల్​ పీఠాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం.

దీనిని కూడా చదవండి : BRS Municipal Victory | క్యాతన్​పల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్​ఎస్​

Inter Exams 2026 | ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు
Hyderabad Land Allotment | ఎంపీ మల్లు రవి భార్యకు రూ.8 కోట్లు విలువ చేసే భూమి ధారాదత్తం!
Yellareddy Transport Issues | ఎల్లారెడ్డి ప్రజల రవాణా సమస్యలు పరిష్కరించండి: మంత్రిని కోరిన ఎమ్మెల్యే
Rohit Reddy Drugs Case | మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై కేసీఆర్​ ఆగ్రహం.. షోకాజ్​ నోటీసులు జారీ
Revanth Reddy Meeting | సీఎం రేవంత్​ను కలిసిన అమెరికా డెలావర్ రాష్ట్ర గవర్నర్
TAGGED:BJP winsBRS TelanganaKhanapur Municipallocal elections Indiamunicipal council election
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Hyderabad Land Scam Hyderabad Land Scam | హైదరాబాద్​లో రూ.7 వేల కోట్ల భూ కుంభకోణం.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు
Next Article Youth suicide phone denial | Youth suicide phone denial | సెల్‌ఫోన్ కొనివ్వలేదని ప్రాణం తీసుకున్న యువకుడు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?