అక్షరటుడే, వెబ్‌డెస్క్: Khanapur Municipal Election | నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో బీఆర్ఎస్ నేత జాన్సన్ నాయక్ వ్యూహం ఫలించింది. కాంగ్రెస్‌కు పీఠం దక్కకుండా చేయాలని చేసిన ఆయన ప్రయత్నం ఫలించింది. జాన్సన్ నాయక్ చక్రం తిప్పడంతో ఖానాపూర్ మున్సిపల్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవితో సరిపెట్టుకుంది.
Khanapur Municipal Election | వాయిదాల తర్వాత..
రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరిలో మున్సిపలు ఎన్నికలు జరిగిన విషయం విదితమే. అయితే హంగ్ వచ్చిన కొన్ని చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. కాగా.. ఈ చోట్ల ఫిబ్రవరి 17న ఎన్నికలు జరిగాయి. అయితే మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం ఛైర్పర్సన్ల ఎన్నిక శనివారం పూర్తయింది. ఖానాపూర్‌లో సైతం ఎన్నికలు నిర్వహించగా.. కాంగ్రెస్ సభ్యులు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆందోళన నిర్వహించగా అధికారులు పోస్ట్‌పోన్ చేశారు.
Khanapur Municipal Election | బీఆర్ఎస్ మద్దతుతో..
బల్దియాలో 12 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందిన విషయం తెలిసిందే. స్వతంత్ర అభ్యర్థి, ఎక్స్ అఫీషియో ఓటుతో కాంగ్రెస్ బలం ఐదుకు చేరింది. దీంతో ఎలాగైనా మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నం చేసింది. దీంతో ఖాన్పూర్ పీఠాన్ని అధికార పార్టీకి దక్కకుండా చేయాలని వ్యూహం రచించారు. బీజేపీకి మద్దతు ఇచ్చి ఛైర్పర్సన్ పీఠాన్ని ఆ పార్టీకి అప్పగించారు. వైస్ ఛైర్మన్ పదవిని బీఆర్ఎస్ నేతలు తీసుకున్నారు.
Khanapur Municipal Election | వీడిన ఉత్కంఠ
ఖానాపూర్ మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక ఆదివారం నిర్వహించారు. పలుమార్లు వాయిదా పడిన ఎన్నిక ఎట్టకేలకు పూర్తి కావడంతో ఉత్కంఠ వీడింది. బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనిక ఛైర్‌పర్సన్‌గా ఎన్నిక కాగా.. బీఆర్ఎస్కు చెందిన మహమ్మద్ షోయబ్ వైస్ ఛైర్మన్‌గా గెలిచారు.
ఇది కూడా చదవండి..: Khanapur Municipal Election | ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ కైవసం
