Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kidney Stones Beer Myth | బీరు తాగితే కిడ్నీ రాళ్లు కరుగుతాయా.. నిపుణులు ఏమి చెబుతున్నారంటే!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

లైఫ్​స్టైల్​ - Kidney Stones Beer Myth | బీరు తాగితే కిడ్నీ రాళ్లు కరుగుతాయా.. నిపుణులు ఏమి చెబుతున్నారంటే!

లైఫ్​స్టైల్​తాజా వార్తలు

Kidney Stones Beer Myth | బీరు తాగితే కిడ్నీ రాళ్లు కరుగుతాయా.. నిపుణులు ఏమి చెబుతున్నారంటే!

కిడ్నీ రాళ్ల సమస్య ఉన్నవారు బీరుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అపోహలను నమ్మి ఆరోగ్యాన్ని పాడుచేసుకోకండి.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 4, 2026 10:22 సా.
Naresh chandan
1 రోజు ago
Share
Kidney Stones Beer Myth
Kidney Stones Beer Myth

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kidney Stones Beer Myth | మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడటం సర్వసాధారణమైపోయింది. శరీరంలోని కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాలు పేరుకుపోయి చిన్న స్పటికాలుగా మారి, కాలక్రమేణా రాళ్లుగా రూపాంతరం చెందుతాయి. ఇవి మూత్ర నాళానికి అడ్డంకి కలిగించినప్పుడు తీవ్రమైన నొప్పి, మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Contents
  • Kidney Stones Beer Myth | బీరు తాగితే.. ఒక అపోహే!
    • Kidney Stones Beer Myth | బీరు వల్ల కలిగే అనర్థాలు ఇవే:
      • అసలైన పరిష్కారం ఏంటి?

Kidney Stones Beer Myth | బీరు తాగితే.. ఒక అపోహే!

బీరు తాగడం వల్ల మూత్రం ఎక్కువగా వస్తుందని, దానితో పాటు రాయి కూడా బయటకు వచ్చేస్తుందని చాలామంది నమ్ముతుంటారు. కానీ ఇది కేవలం ఒక భ్రమ మాత్రమేనని నిపుణులు స్పష్టం చేశారు. బీరు తాగడం వల్ల కలిగే అదే ఫలితాన్ని (మూత్ర ఉత్పత్తి పెరగడం) మనం మంచినీళ్లు లేదా నిమ్మరసం తాగడం ద్వారా కూడా పొందవచ్చు. దీని కోసం మద్యం తాగాల్సిన అవసరం లేదు.

Kidney Stones Beer Myth | బీరు వల్ల కలిగే అనర్థాలు ఇవే:

వాపు వచ్చే అవకాశం: ఒకవేళ రాయి మూత్ర నాళంలో అడ్డం పడి ఉన్నప్పుడు బీరు తాగితే, ఒక్కసారిగా మూత్రం ఎక్కవై కిడ్నీలో వాపు వచ్చే ప్రమాదం ఉంది. ఇది పరిస్థితిని మరింత విషమింపజేస్తుంది.

ఆరోగ్య సమస్యలు: బీరులో ఉండే ఆల్కహాల్ వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది కిడ్నీలకే కాకుండా కాలేయానికి కూడా హాని కలిగిస్తుంది.

వ్యసనం: కేవలం వైద్యం పేరుతో బీరు అలవాటు చేసుకోవడం వల్ల కాలక్రమేణా అది వ్యసనంగా మారి ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది.

అసలైన పరిష్కారం ఏంటి?

సాధారణంగా 5 మి.మీ కంటే చిన్నగా ఉన్న కిడ్నీ రాళ్లు మంచినీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా సహజంగానే మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. నీరు ఎక్కువగా తాగడం వల్ల మూత్రం పలుచగా మారి రాళ్లు సులభంగా కదులుతాయి.

ఒకవేళ రాయి పరిమాణం పెద్దగా ఉన్నప్పుడు సొంత వైద్యం మానుకొని, కచ్చితంగా నిపుణులైన యూరాలజిస్ట్‌ను సంప్రదించి సరైన చికిత్స లేదా శస్త్రచికిత్స చేయించుకోవడమే సురక్షితమైన మార్గం.

ఇది కూడా చదవండి: Jeffrey Epstein Documentary | బాలికల మాంసం ముద్దలపై ఎప్‌స్టీన్ దుష్కృత్యాలు.. ప్రపంచాన్ని కుదిపేస్తున్న భారీ సెక్స్​ కుంభకోణం..

Oracle layoffs news | Oracleలో భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపు.. ఉదయం నుంచే లేఆఫ్ ఈ మెయిల్స్!
Oman Drone Attack | ఒమన్​పై డ్రోన్​​ దాడి.. ఇద్దరు భారతీయుల దుర్మరణం
Lebanon Children Killed | ఇజ్రాయెల్​ దాడిలో 100 మందికి పైగా చిన్నారులు మృతి.. లెబనాన్​ ప్రకటన
Mobile | స్మార్ట్‌ఫోన్ కింద ఆ చిన్న రంధ్రం.. ఎందుకు ఉంటుందంటే!
The Kerala Story 2 | కేరళ స్టోరీ -2 విడుదలకు తొలగిన అడ్డంకులు.. సినిమాపై స్టే ఎత్తివేత..
TAGGED:beer mythhealth mythshydration tipskidney healthkidney stonesKidney Stones Beer Mythstone treatmenturinary healthurology advice
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Marriage Relationship Marriage Relationship | భార్యాభర్తలు విడిపోవడానికి కారణం ఆ చిన్న పొరపాటే.. చాణక్య నీతి ఏం చెబుతుందంటే!
Next Article Ranu Bombayiki Ranu Song Ranu Bombayiki Ranu Song | యూట్యూబ్‌లో సంచలనం.. రానూ బొంబాయికి రానూ’ ఫోక్ సాంగ్‌కు 800 మిలియన్ వ్యూస్!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?