అక్షరటుడే,హైదరాబాద్: Kids Iron Foods | పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలలో రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలు కీలక పాత్ర పోషిస్తాయి. రక్తంలో తగినంత హిమోగ్లోబిన్ లేకపోతే పిల్లలు త్వరగా అలసిపోవడం, ఏకాగ్రత తగ్గడం, ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు ఎదుర్కొంటారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పోషకాహార లోపం వల్ల చాలామంది పిల్లలు రక్తహీనత (Anemia) బారిన పడుతున్నారు. అయితే, మన వంటింట్లో దొరికే సహజసిద్ధమైన ఆహార పదార్థాలతోనే ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
Kids Iron Foods | హిమోగ్లోబిన్ పెంచే పోషకాహార నిధి:
పిల్లల రక్తంలో ఎర్ర రక్తకణాల వృద్ధికి కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలు అద్భుతంగా పనిచేస్తాయి.
రాగి జావ: రాగుల్లో క్యాల్షియంతో పాటు ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం పిల్లలకు రాగి జావ ఇవ్వడం వల్ల వారి ఎముకలు దృఢంగా మారడమే కాకుండా రక్తహీనత సమస్య దరిచేరదు.
హలీమ్ గింజలు, కిస్మిస్: హలీమ్ గింజలు (Garden Cress Seeds) ఐరన్‌కు కేరాఫ్ అడ్రస్. వీటిని నానబెట్టి పాలు లేదా నీటితో ఇస్తే ఫలితం బాగుంటుంది. అలాగే ఎండుద్రాక్ష (కిస్మిస్) శరీరానికి తక్షణ శక్తిని ఇస్తూ హిమోగ్లోబిన్ పెరగడానికి తోడ్పడతాయి.
నువ్వులు, అటుకులు: నువ్వుల్లో ఉండే ఐరన్, ఫోలిక్ యాసిడ్ రక్తకణాల ఉత్పత్తికి సహాయపడతాయి. అటుకులు కూడా తక్కువ ఖర్చుతో కూడిన అద్భుతమైన ఐరన్ వనరు.
Kids Iron Foods | రక్తకణాల ఉత్పత్తికి సమతుల్య ఆహారం:
కేవలం ఐరన్ ఉన్న ఆహారం తీసుకోవడమే కాకుండా, శరీరానికి అవసరమైన ఇతర పోషకాలు కూడా అందాలి. ఆకుకూరలు (ముఖ్యంగా తోటకూర, పాలకూర), పప్పుధాన్యాలు, గుడ్లు పిల్లల డైట్‌లో అంతర్భాగం కావాలి. మాంసాహారం తినే పిల్లలకు గుడ్లు ఇవ్వడం వల్ల మంచి ప్రోటీన్‌తో పాటు ఐరన్ కూడా లభిస్తుంది.”
విటమిన్-సి ప్రాముఖ్యం:
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. మనం ఎంత ఐరన్ ఉన్న ఆహారం తీసుకున్నా, అది శరీరానికి సక్రమంగా వంటబట్టాలంటే ‘విటమిన్-సి’ తప్పనిసరి. మనం తిన్న ఆహారంలోని ఐరన్‌ను శరీరం గ్రహించేలా చేయడంలో విటమిన్-సి సహాయపడుతుంది.
అందుకే భోజనంతో పాటు లేదా భోజనం తర్వాత నారింజ, ఉసిరి, నిమ్మ వంటి పండ్లను పిల్లలకు ఇవ్వాలి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు రక్తం కూడా శుద్ధి అవుతుంది.
ఇది కూడా చదవండి..: Nosebleeds in Summer | వేసవిలో ముక్కు నుండి రక్తం వస్తోందా? భయపడకండి.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు!
ఇది కూడా చదవండి..: Kitchen Sponge Bacteria | వంటగదిలో అత్యంత ప్రమాదకరమైన వస్తువు ఇదే.. దీనిని మార్చలేదో ఈ రోగాలు గ్యారెంటీ!
