అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kodagu trekking missing techie | కర్ణాటకలో ట్రెక్కింగ్‌కు వెళ్లి అదృశ్యమైన టెకీ ఆచూకీ మూడు రోజుల తర్వాత లభ్యమైంది. ఈ ఘటన Kodagu districtలోని ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశం Tadiandamol Hills ప్రాంతంలో చోటుచేసుకుంది.
Kodagu trekking missing techie | మూడు రోజుల క్రితం
మూడు రోజుల క్రితం శరణ్య (36) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ట్రెక్కింగ్ కోసం తడియాండమోల్ హిల్స్‌కు వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సీసీటీవీ ఫుటేజ్‌లో శరణ్య ట్రెక్కింగ్ రూట్‌లోకి వెళ్తున్న దృశ్యాలు మాత్రమే నమోదయ్యాయి. తిరిగి బయటకు వచ్చిన రికార్డు లేదు.
ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారులు, స్థానికులు కలిసి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజుల పాటు విస్తృతంగా శోధన కొనసాగించారు. చివరకు శరణ్య ఆచూకీ లభ్యమైంది. ఆమెను సురక్షితంగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Baby Girl Birth Luck | ఆడపిల్ల పుడితే అదృష్టం కలిసి వస్తుందా.. శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే!
