అక్షరటుడే, లింగంపేట: Komatpalli Youth Death | చెరువులో పడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన లింగంపేట మండలం (Lingampet Mandal) కోమట్‌పల్లిలో చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Komatpalli Youth Death | కొన్నేళ్ల క్రితం తండ్రి విద్యుత్‌షాక్‌తో..
లింగంపేట ఎస్సై దీపక్‌కుమార్ (SI Deepak Kumar) తెలిపిన వివరాల ప్రకారం.. కోమట్‌పల్లి గ్రామానికి చెందిన ధరణి సాయవ్వ తన కుమారుడు నవీన్(18)తో కలిసి నివాసముంటోంది. నవీన్ తండ్రి పదకొండేళ్ల క్రితం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. దీంతో తల్లి సాయవ్వ నవీన్ అల్లారుముద్దుగా పెంచుకుంది. అయితే సోమవారం కామారెడ్డికి పనినిమిత్తం వెళ్లిన సాయవ్వ ఇంటికి తిరిగి వచ్చేసరికి కుమారుడు కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించింది.

Komatpalli Youth Death | కోమటిపల్లి చెరువుపై చెప్పులు..
కోమటిపల్లి చెరువు కట్టపై కుమారుడి చెప్పులు కనపడడంతో చెరువులో గాలించగా మృతదేహం లభించినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడం.. భర్త కొన్నేళ్ల క్రితం కాలం చేయడంతో సాయవ్వం ప్రస్తుతం ఒంటరిదైంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి..:Cyber Crime Legal Aid | సైబర్ నేర బాధితులకు ఉచిత న్యాయ సహాయం: ఎస్పీ రాజేష్ చంద్ర

