Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Konda Sushmitha | పరకాల ఎమ్మెల్యే అవుతా.. కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Konda Sushmitha | పరకాల ఎమ్మెల్యే అవుతా.. కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ

Konda Sushmitha | పరకాల ఎమ్మెల్యే అవుతా.. కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు

మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పరాకల నుంచి పోటీ చేస్తానన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 4, 2026 3:11 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Konda Sushmitha

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Konda Sushmitha | ఉమ్మడి వరంగల్ (Warangal)​ జిల్లా కాంగ్రెస్​లో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కొంతకాలంగా సైలెంట్​గా ఉన్న కొండా కుటుంబం మరోసారి హాట్ కామెంట్స్​ చేసింది. పరకాల నుంచి తాను పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుస్తానని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కూతురు సుష్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Contents
  • Konda Sushmitha | ఎన్నికల్లో పోటీ చేస్తా
    • Konda Sushmitha | ఇక్కడి నుంచే..
      • నా కూతురికి ధైర్యం ఎక్కువ

వరంగల్ కాంగ్రెస్​లో కొంతకాలంగా అంతర్గత విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. కొండా కుటుంబానికి, ఇతర ఎమ్మెల్యేలు, నేతలకు మధ్య పొసగడం లేదు. కొండా మురళి గతంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి (Kadiyam Srihari), రేవూరి ప్రకాశ్​పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో వివాదం మొదలైంది. అనంతరం తన కూతరు పరకాల నుంచి పోటీ చేస్తుందని కొండా సురేఖ సైతం పేర్కొన్నారు. ఈ గొడవ పలుమార్లు క్రమ శిక్షణ కమిటీ వద్దకు కూడా వెళ్లింది. అయితే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమన్వయంతో పని చేయాలని నేతలకు కమిటీ సూచించింది. ఇటీవల ఎన్నికలు ముగియగా.. తాజాగా కొండా సుష్మిత తాను ఎమ్మెల్యే అవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Konda Sushmitha | ఎన్నికల్లో పోటీ చేస్తా

తాను తప్పకుండా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని సుష్మిత పటేల్​ అన్నారు. పరకాల (Parakal) నుంచి పోటీకి సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. కాగా అక్కడ కాంగ్రెస్​ నుంచి గెలిచిన రేవూరి ప్రకాశ్​రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్​ ఎమ్మెల్యే ఉన్న స్థానంలో తాను పోటీ చేస్తానని సుష్మిత పటేల్​ చెప్పడం గమనార్హం. దీంతో మరోసారి వరంగల్​ కాంగ్రెస్​లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

Konda Sushmitha | ఇక్కడి నుంచే..

వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల జాతరకు కొండా సుష్మిత తన తండ్రి మురళితో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన తల్లిదండ్రుల ప్రస్థానం కొమ్మాల జాతర నుంచి ప్రారంభం అయిందన్నారు. తన రాజకీయ ప్రస్థానం సైతం ఇక్కడి నుంచే మొదలు అవుతుందని చెప్పారు. తన తండ్రి మురళి ఇప్పటికే ముగ్గురు, నలుగురి గుండెల్లో నిద్ర పొతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నా కూతురికి ధైర్యం ఎక్కువ

కొండా మురళి (Konda Murali) మాట్లాడుతూ.. తన కూతురికి ధైర్యం ఎక్కువ అన్నారు. పరకాల తమ అడ్డా అని, వచ్చే ఎన్నికల తన బిడ్డ పోటీ చేస్తుందని చెప్పారు. సుష్మితకు ధైర్యం ఎక్కువ అని, ఎవరినైనా ఎదిరిస్తుందని పేర్కొన్నారు. కార్యకర్తలకు సమస్య వస్తే ఎవర్నీ వదలిపెట్టదని తెలిపారు. పరకాల నియోజకవర్గానికి అండగా ఉంటుందని చెప్పారు. కొండా మురళి, సుష్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్​ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

konda family

దీనిని కూడా చదవండి : Hyderabad Land Allotment | ఎంపీ మల్లు రవి భార్యకు రూ.8 కోట్లు విలువ చేసే భూమి ధారాదత్తం!

Ramakrishna Rao Extension | సీఎస్​ పదవీ కాలం మరో మూడు నెలల పొడిగింపు!
New Governors Appointed | పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్​లు.. తెలంగాణ గవర్నర్​గా శివప్రతాప్​ శుక్లా
Double Bedroom Houses | ‘డబుల్’ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం : మంత్రి పొంగులేటి
Nizamabad Urban Development | నియోజకవర్గ అభివృద్ధిపై పురోగతి సాధించాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​
KTR Assembly Attack | శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం : కేటీఆర్​
TAGGED:Congress internal conflictKonda MuraliKonda SurekhaKonda SushmithaParakala constituencyParakala MLA contestTelangana PoliticsWarangal Congress
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kamareddy 38th Ward Kamareddy 38th Ward | దొంగ ఓట్లతోనే గెలిచారు..: 38వ వార్డు అభ్యర్థి రంగ మాధవి
Next Article Bachupally Fire Victims Bachupally Fire Victims | బాచుపల్లి బాధితులకు అండగా ఉంటాం : ఎంపీ ఈటల
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?