అక్షరటుడే, వెబ్డెస్క్: Kondagattu temple accident | కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో అపశృతి చోటు చేసుకుంది. ఆలయం వద్ద వేసిన చలువ పందిరి కూలిపోయింది. ఈ ఘటనలో 15 మంది భక్తులు గాయపడ్డారు.
జగిత్యాల జిల్లా (Jagtial District)కొడిమ్యాల మండలం కొండగట్టు అంజన్న స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. గురువారం హనుమాన్ జయంతి (Hanuman Jayanti) కావడంతో గత నాలుగైదు రోజులుగా ఆలయానికి భక్తులు, హనుమాన్ స్వాములు పెద్ద ఎత్తున వస్తున్నారు. హనుమాన్ జయంతి కోసం ఆలయం వద్ద అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎండలు మండుతుండటంతో చలువ పందిళ్లు వేశారు.
Kondagattu temple accident | భక్తుల ఆగ్రహం
హనుమాన్ విజయత్సవం కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు కూలిపోవడంతో పలువురు భక్తులు గాయపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పందిళ్లను సరి చేయడానికి చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి..: Kaushik Reddy CID Notices | ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు
