Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: KP Sharma Oli Arrest | నేపాల్ మాజీ ప్రధాని ఓలీ శర్మ అరెస్ట్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - KP Sharma Oli Arrest | నేపాల్ మాజీ ప్రధాని ఓలీ శర్మ అరెస్ట్

జాతీయం

KP Sharma Oli Arrest | నేపాల్ మాజీ ప్రధాని ఓలీ శర్మ అరెస్ట్

నేపాల్​ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ ప్రధాని కేపీ ఓలీ శర్మ అరెస్టయ్యారు.

Srinivas kolluri
Last updated: మార్చి 28, 2026 10:26 ఉద.
Srinivas Kolluri
6 గంటలు ago
Share
KP Sharma Oli Arrest

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KP Sharma Oli Arrest | నేపాల్​ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ ప్రధాని కేపీ ఓలీ శర్మ అరెస్టయ్యారు. ఎన్నికలకు ముందు జరిగిన Gen-Z నిరసనలను అణచివేశారన్న కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Contents
  • KP Sharma Oli Arrest| చట్టానికి అతీతులు కారు
    • KP Sharma Oli Arrest| న్యాయపోరాటం చేస్తాను
      • KP Oli Sharma Arrest | కమిటీ ఏర్పాటు

కొత్త ప్రధానిగా బలేంద్ర షా ప్రమాణ స్వీకారం చేసిన ఒక రోజు తర్వాత, గత సంవత్సరం జరిగిన జెన్ జెడ్ (Gen Z) నిరసనలలో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ (Former Nepal PM KP Sharma Oli)ని అరెస్టు చేశారు. భక్తపూర్‌లోని గుండులో ఉన్న ఆయన నివాసం నుంచి నేపాల్ పోలీసులు ఓలీని అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్‌ను కూడా శనివారం ఉదయం అరెస్టు చేశారు. చట్ట ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని కాఠ్మండు వ్యాలీ పోలీసు ప్రతినిధి ఓం అధికారి తెలిపారు.

KP Sharma Oli Arrest| చట్టానికి అతీతులు కారు

కొత్తగా నియమితులైన హోం వ్యవహారాల మంత్రి సుడాన్ గురుంగ్ మాట్లాడుతూ.. చట్టానికి ఎవరూ అతీతులు కారు అన్నారు. తాము మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ, మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్‌లను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఇది ఎవరిపైనా ప్రతీకారం కాదని పేర్కొన్నారు. న్యాయానికి నాంది మాత్రమే అని చెప్పారు. ఇప్పుడు దేశం కొత్త దిశను తీసుకుంటుందని ఆయన తెలిపారు.

KP Sharma Oli Arrest| న్యాయపోరాటం చేస్తాను

తన అరెస్ట్​పై కేపీ శర్మ ఓలీ ( KP Sharma Oli Arrest) స్పందిస్తూ.. కక్షపూరితంగా అరెస్టు చేశారని ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్ 8, 9 తేదీలలో జరిగిన అవినీతి వ్యతిరేక యువజన ఉద్యమంలో కనీసం 19 మంది యువకులతో సహా 70 మందికి పైగా మృతి చెందారు. సోషల్ మీడియాపై విధించిన స్వల్పకాలిక నిషేధంతో ప్రారంభమైన ఈ ఉద్యమం, ఆర్థిక ఇబ్బందులపై దీర్ఘకాలంగా పేరుకుపోయిన ఆగ్రహాన్ని మరింత తీవ్రతరం చేసింది. మరుసటి రోజు పార్లమెంట్, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టడంతో ఈ అశాంతి దేశవ్యాప్తంగా వ్యాపించి కేపీ ఓలీ ప్రభుత్వం కూలిపోయింది.

KP Oli Sharma Arrest | కమిటీ ఏర్పాటు

ఇటీవల జరిగిన నేపాల్ పార్లమెంటరీ ఎన్నికలలో (Nepal Parliamentary Elections) ర్యాపర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన బాలేంద్ర షా గెలిచిన విషయం తెలిసిందే. జెన్​–జీ నిరసనల సమయంలో జరిగిన హింసపై విచారణ జరిపేందుకు ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. శుక్రవారం బాలేంద్ర షా అధ్యక్షతన నూతన ప్రభుత్వం తొలి మంత్రివర్గ సమావేశం జరిగింది తిరుగుబాటు సమయంలో నిర్లక్ష్యం వహించినందుకు ఓలీ, లేఖక్‌లతో సహా బాధ్యులైన వారికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని ఉన్నత స్థాయి కమిషన్ విచారణ నివేదికను తక్షణమే అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ క్రమంలో వారిని అరెస్ట్​ చేయడం గమనార్హం.

ఇది కూడా చదవండి : Allahabad High Court | మరో మహిళతో సహజీవనం నేరం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు

Nishant Kumar JDU | రాజకీయాల్లోకి బీహార్ సీఎం నితీశ్ కుమారుడు ఎంట్రీ.. జేడీయూలో చేరిన నిశాంత్ కుమార్..
KA Paul War Statement | యుద్ధాన్ని వెంటనే ఆపాలి : కేఏ పాల్
Kuwait Indian Embassy | కువైట్‌లో ఉద్రిక్తత పరిస్థితులు.. భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
West Asia Tensions | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై మంత్రి జైశంకర్​ ప్రకటన
Maharashtra Factory Explosion | మహారాష్ట్రలో భారీ పేలుడు.. 17 మంది మృతి
TAGGED:Balendra ShahFormer Nepal PM KP Sharma OliGen Z protests NepalKP Oli Sharma ArrestNepal ex PM arrestNepal newsNepal Parliamentary ElectionsNepal politicspolitical crisis Nepalprotest crackdown
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Telangana RC DL Delivery Telangana RC DL Delivery | తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. లైసెన్స్, ఆర్సీ కార్డులు ఇక నేరుగా ఇంటికే!
Next Article Osmania Biscuits Adulteration Osmania Biscuits Adulteration | క్యాన్సర్​ కారకాలతో ఉస్మానియా బిస్కెట్ల తయారీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?