అక్షరటుడే, హైదరాబాద్: KR Nagaraju Dance | గ్రేటర్ హైదరాబాద్‌లోని Ravindra Bharathi వేదికగా ప్రజాప్రతినిధుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే K R Nagaraju ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
KR Nagaraju Dance | విశేష స్పందన..
ప్రజా గాయకుడు Gaddar వేషధారణలో వేదికపై నృత్యం చేస్తూ K R Nagaraju అందరినీ అలరించారు. గద్దర్ శైలిని అనుకరిస్తూ ఆయన చేసిన ప్రదర్శనకు సభికుల నుంచి ఘనమైన స్పందన లభించింది. రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా కళాకారుడిగానూ తనలోని మరో కోణాన్ని నాగరాజు ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
KR Nagaraju Dance | ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా..
కేఆర్ నాగరాజు గతంలో ఐపీఎస్ అధికారిగా సేవలందించారు. ఆ సమయంలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగానూ గుర్తింపు పొందారు. నక్సలైట్‌లపై కీలక ఆపరేషన్లు నిర్వహించారు. ఎర్రజెండాపై తుపాకీ ఎక్కుపెట్టారు. అనంతరం ప్రజాసేవ వైపు మళ్లి ఎమ్మెల్యేగా గెలుపొంది, ప్రజలకు సేవలు అందిస్తున్నారు.
ఇప్పుడు ప్రజాప్రతినిధుల క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గద్దర్ పాత్రలో కనిపించి అలరించారు. ఇప్పుడు అదే ఎర్రజెండాను చేతిలో పట్టుకుని.. “పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా..” అంటూ ఆడిపాడారు. అధికారిగా కఠినంగా వ్యవహరించిన నాగరాజు.. వేదికపై కళాకారుడిగా చూపిన భిన్న కోణం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
గద్దర్ వేషధారణలో నృత్యం చేసిన వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
రవీంద్రభారతిలో జరుగుతున్న ప్రజాప్రతినిధుల కల్చరల్ ఈవెంట్స్ కార్యక్రమం pic.twitter.com/6z6aXsngRK
— Telugu Scribe (@TeluguScribe) March 29, 2026
