Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: KTR ACB Chargesheet | ఏసీబీ ఛార్జిషీటుపై స్పందించిన కేటీఆర్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తాజా వార్తలు - KTR ACB Chargesheet | ఏసీబీ ఛార్జిషీటుపై స్పందించిన కేటీఆర్​

తాజా వార్తలుతెలంగాణ

KTR ACB Chargesheet | ఏసీబీ ఛార్జిషీటుపై స్పందించిన కేటీఆర్​

ఫార్ములా ఈ కారు రేస్​ కేసులో ఛార్జిషీట్​పై కేటీఆర్​ స్పందించారు. తమ పారదర్శక పాలనకు అది ఒక ధృవీకరణ పత్రం అన్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 25, 2026 11:41 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
KTR ACB Chargesheet

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR ACB Chargesheet | ఫార్ములా ఈ కారు రేస్​ కేసులో ఏసీబీ అధికారులు (ACB Officers)  సోమవారం ఛార్జిషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1గా కేటీఆర్‌, ఏ2గా ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌ కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి, ఏ4గా స్పోర్ట్స్‌ కన్సల్టెంట్‌ కిరణ్‌ మల్లేశ్వరరావు, ఏ5గా యూకేకి చెందిన ఎఫ్‌ఈవో సంస్థను ఏసీబీ చేర్చింది. దీనిపై తాజాగా ఎక్స్​ వేదికగా కేటీఆర్​ (KTR) స్పందించారు.

Contents
  • KTR ACB Chargesheet | అభివృద్ధిపై దృష్టి పెట్టాం
    • KTR ACB Chargesheet | రూ.55 కోట్ల నష్టం

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చి రెండేళ్ల నాలుగు నెలలు అయిందని కేటీఆర్​ అన్నారు. అన్ని పత్రాలు, ప్రభుత్వ యంత్రాంగం కాంగ్రెస్​ చేతిలో ఉందని చెప్పారు. అయినా కూడా కేవలం ఫార్ములా ఇ రేసు విషయంలో అదీ బ్యాంకు నుంచి బ్యాంకుకు నిధులు బదిలీ అయినందుకు కేసు పెట్టారని ఎద్దేవా చేశారు. ఈ ఏసీబీ ఛార్జిషీట్ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వపు స్పష్టమైన నిస్సహాయతకు ప్రతీక అన్నారు. అంతేగాకుండా తమ పారదర్శక పాలనకు ఒక ధృవీకరణ పత్రం అని పేర్కొన్నారు.

KTR ACB Chargesheet | అభివృద్ధిపై దృష్టి పెట్టాం

బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఉల్లంఘన కూడా జరగలేదని ఈ ఛార్జిషీట్ నిరూపిస్తోందని కేటీఆర్​ అన్నారు. తాము కేవలం అభివృద్ధిపైనే దృష్టి సారించి ప్రభుత్వాన్ని నడిపామన్నారు. హైదరాబాద్‌ను వరల్డ్ ఫార్ములా ఇ రేసింగ్‌ (World Formula E Racing)లో చేర్చడానికి ఉపయోగించిన రూ. 49 కోట్ల బ్యాంకు నుంచి బ్యాంకుకు నిధుల బదిలీని ఒక స్కామ్​గా చిత్రీకరించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR ACB Chargesheet | రూ.55 కోట్ల నష్టం

బీఆర్​ఎస్​ హయాంలో హైదరాబాద్​ (Hyderabad)లో ఫార్ములా ఈ కారు రేసు నిర్వహించారు. ఇందులో అవినీతి జరిగిందని కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక కేసు పెట్టింది. ఇప్పటికే ఏసీబీ అధికారులు కేటీఆర్​తో పాటు పలువురిని విచారించారు. ఆయన విచారణకు ఇటీవల గవర్నర్ అనుమతించారు. ఐఏఎస్​ అధికారి అర్వింద్​ కుమార్​ ప్రాసిక్యూషన్​కు కేంద్ర ప్రభుత్వం (Central Government) సైతం ఒకే చెప్పింది. దీంతో ఏసీబీ అధికారులు ఛార్జిషీటు దాఖలు చేశారు. రేస్‌ కోసం విదేశీ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము చెల్లించడంతో ప్రభుత్వానికి రూ.55 కోట్ల మేర నష్టం జరిగిందని ఏసీబీ తెలిపింది.

ఇది కూడా చదవండి..: Petrol Shortage Rumors | రాష్ట్రంలో పెట్రోల్​ కొరత లేదు.. డీలర్స్ అసోసియేషన్​ క్లారిటీ

Gold Silver Prices | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. రానున్న రోజుల‌లో పెరిగే ఛాన్స్..!
Annaram Barrage Controversy | అన్నారం బ్యారేజీ కూల్చేందుకు కుట్ర.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు
March 10 PRE Market Analysis | శాంతించిన క్రూడ్ ఆయిల్ ధర.. పరుగులు తీస్తున్న గ్లోబల్ మార్కెట్లు
LB Nagar Hookah Raid | హుక్కా సెంటర్​పై దాడి.. 36 మంది అరెస్ట్
Bandi Sanjay Allegations | ఎంఐఎం మెప్పు కోసమే అరెస్టులు, దాడులు: కేంద్రమంత్రి బండి సంజయ్
TAGGED:ACB OfficersCentral GovernmentCM Revanth ReddyHyderabadKTRKTR ACB ChargesheetWorld Formula E Racing
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hyderabad Terror Links Hyderabad Terror Links | హైదరాబాద్‌లో మళ్లీ ఉగ్రలింకులు వెలుగులోకి.. విజయవాడ కేసుతో సంబంధం ఉన్న‌ మహిళ అరెస్ట్
Next Article  Sircilla Weavers Dues Sircilla Weavers Dues | నేత కార్మికుల విద్యుత్​ బకాయిలు రద్దు చేయాలి : కేటీఆర్​
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: MLA Disqualification Case | ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?