అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR Anger | మాజీ మంత్రులు హరీశ్‌రావు (Harish Rao), సబితా ఇంద్రారెడ్డి ఇతర నేతలను పోలీసులు మంగళవారం ఉదయం హౌజ్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా వారిని అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ భూమిని కాపాడుకోవాలని పోరాడుతున్న రైతులకు బాసటగా నిలిచేందుకు వెళ్తున్న నేతలను గృహనిర్బంధం చేయడం, అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ (Congress government) పిరికిపంద చర్య అని కేటీఆర్ అభివర్ణించారు. ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు.
KTR Anger | భూములపై పడ్డ సీఎం
అధికారంలోకి వచ్చిన నాటి నుండి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హామీలను గాలికొదిలేసి పేదల భూములపై పడ్డారని కేటీఆర్ మండిపడ్డారు. పరిగి నియోజకవర్గంలోని కాడ్లాపూర్, రాపోలు గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రైతుల నుంచి 1200 ఎకరాలు లాక్కోవడాన్ని ఖండించారు. రైతు భరోసా, రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. ఇప్పుడు పరిశ్రమల పేరుతో భూ సేకరణకు దిగడం దుర్మార్గమని పేర్కొన్నారు. కొత్తగా ఒక పరిశ్రమను కూడా తీసుకురాని ప్రభుత్వం.. పేదల భూములను మాత్రం లాక్కుంటోందన్నారు. కాంగ్రెస్ నేతలు భూములను కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంత అణచివేతకు పాల్పడినా బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇది కూడా చదవండి..: Tulam Gold Scheme | తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే తులం బంగారం!
