అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR Assembly Attack | తెలంగాణ బడ్జెట్ సమావేశాలు (Telangana Budget Sessions) సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. సమావేశాలకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగులకు కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. తెలంగాణను ఒక ఏటీఎం లాగా మార్చి ఏఐసీసీ పెద్దలకు సమర్పించుకునే శ్రద్ధ ఈ రాష్ట్ర ప్రజల మీద లేదని ఆరోపించారు. శాసనసభలో, శాసనమండలిలో తప్పకుండా ప్రతి పేదవాడి తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.
KTR Assembly Attack | రాహుల్ గాంధీకి వెయ్యి కోట్లు
కాంగ్రెస్ రైతులకు వెన్నుపోట్లు.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి వెయ్యి కోట్లు అంటూ గన్ పార్క్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి గవర్నర్ ప్రసంగంలో ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పిస్తామని చెప్పారని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు మూడో గవర్నర్ ప్రసంగం అవుతుందని, రెండున్నర సంవత్సరాలు గడిచిపోయిందన్నారు. ఇప్పటికి ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి..: Gas Cylinder Shortage | కొనసాగుతున్న గ్యాస్ కష్టాలు

