అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR Criticizes Government | రాష్ట్రంలో దోచుకో.. దాచుకో స్కీం నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, సీఎం, ఆయన కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మంచిర్యాల (Mancherial) జిల్లా బీఆర్ఎస్ (BRS) కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంపదను కాపాడాల్సింది పోయి.. దేశంలోనే ఎక్కడాలేని విధంగా సైట్ విజిట్ సర్టిఫికేట్ తెచ్చిందన్నారు. రేవంత్, ఆయన బామ్మర్ది కలిసి వేల కోట్ల సింగరేణి సంపదను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. సీఎంకు దమ్ముంటే ఈ వ్యవహారంపై సిట్, ఏసీబీ విచారణ చేయించాలని సవాల్ చేశారు. సింగరేణిలోని ప్రతి కాంట్రాక్ట్ సీఎం బావమరిది సృజన్‌రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తుందన్నారు.
KTR Criticizes Government | ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు తీర్పునిచ్చారని కేటీఆర్ అన్నారు. అయితే మంత్రి వివేక్ కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేసి, పోలీసులను అడ్డంపెట్టుకొని మున్సిపల్ పీఠం దక్కించుకోవాలని చూశారన్నారు. 51 రోజులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. మొక్కవోని ధైర్యంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రజాస్వామ్య వ్యవస్థను గెలిపించారని కొనియాడారు. కాంగ్రెస్ వాళ్లు కోట్లు ఇస్తామన్నా లొంగలేదన్నారు.
KTR Criticizes Government | ఏమని పిలవాలి
బిడ్డ పుట్టాలంటే తొమ్మిది నెలలు సమయం పడుతుంది అని రేవంత్ రెడ్డి అంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి 30 నెలలు అయితుంది, ఇంకా బిడ్డ పుట్టకపోతే నీకు ఏం పేరు పెట్టాలని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచుతామని, రైతు భరోసా రూ.15 వేలు చేస్తామని హామీ ఇచ్చినప్పుడు ఈ విషయం తెలియదా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. ఆరుగ్యారెంటీల అమలు కోసం తాము పోరాటం చేస్తామని, ప్రజలు కలిసి రావాలని కోరారు.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో
బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు తీర్పునిస్తే…
మంత్రి వివేక్ అధికార మదంతో కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేసి,
పోలీసులను అడ్డంపెట్టుకొని అడ్డమైన కేసులు పెట్టించి,
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను జైలుకు పంపిండు.
51 రోజులు ఎన్ని… pic.twitter.com/y2Y3CuXxln
— BRS Party (@BRSparty) April 12, 2026
ఇది కూడా చదవండి : Heat Wave | భానుడి ఉగ్రరూపం.. మండుతున్న ఎండలు
