అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Drugs Test | పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Goud) వ్యాఖ్యలకు కేటీఆర్ (KTR) స్పందించారు. డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలన్న ఆయన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు డ్రగ్స్ వాడటం దురదృష్టకరమన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్‌లో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఏపీకి చెందిన ఎంపీని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలని పీసీసీ చీఫ్ అన్నారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడారు.
Drugs Test | కఠినంగా శిక్షించాలి
వ్యక్తిగతంగా డ్రగ్స్ వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తానని కేటీఆర్ అన్నారు. డ్రగ్స్ వాడకం, చట్టవిరుద్ధ కార్యకలాపాలను బీఆర్‌ఎస్ (BRS) ఖండిస్తుందన్నారు. డ్రగ్స్‌ను వినియోగించేది ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు డ్రగ్స్ టెస్టుకు సిద్ధంగా ఉండాలన్నారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసులోకి తనను లాగితే చట్టపరంగా నోటీసులు ఇస్తానని హెచ్చరించారు.

దీనిని కూడా చదవండి : Rythu Bharosa Funds | రైతులకు గుడ్‌న్యూస్.. 22న రైతు భరోసా నిధుల విడుదల

