Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: KTR Fire on Congress | కాంగ్రెస్ ప్రభుత్వానికి జీరో వాల్యూ : కేటీఆర్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - KTR Fire on Congress | కాంగ్రెస్ ప్రభుత్వానికి జీరో వాల్యూ : కేటీఆర్

తెలంగాణతాజా వార్తలు

KTR Fire on Congress | కాంగ్రెస్ ప్రభుత్వానికి జీరో వాల్యూ : కేటీఆర్

కాంగ్రెస్​ ప్రభుత్వంపై కేటీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలకు విలువ లేకుండా పోయిందన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 17, 2026 12:44 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
KTR Fire on Congress

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR Fire on Congress | కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government)పై మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. మూసీలో ముంచుతున్న ఇండ్లకు జీరో వాల్యూ కాదని, రేవంత్ రెడ్డి సీఎం అయి చేసిన తొలి సంతకానికి జీరో వాల్యూ అన్నారు.

Contents
  • KTR Fire on Congress | సిట్​ వేయాలి
    • KTR Fire on Congress | ఎవరు చెప్పింది నిజం

కాంగ్రెస్ గ్యారంటీ కార్డులకు, డిక్లరేషన్లకు, విశ్వసనీయత కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వానికి విలువ లేదని మండిపడ్డారు.నేనే రాజు.. నేనే మంత్రి అని గతంలో ఎగిరిపడిన వారు సంపద మూటగట్టుకుపోలేరని కేటీఆర్‌ (KTR) పేర్కొన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక తొలి సంతకం ఆరు గ్యారంటీల అమలు చేశామని 2023 గవర్నర్​ ప్రసంగంలో ఉందన్నారు. కానీ ఏళ్లు గడిచినా ఆ హామీలు అమలు కావడం లేదన్నారు. తొలి మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting)లో హామీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారన్నారు.

KTR Fire on Congress | సిట్​ వేయాలి

రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తొలి సంతకం చేసిన ఆరు గ్యారంటీల ఫైలు ఎటు పోయిందని కేటీఆర్​ ప్రశ్నించారు. FSL అగ్నిప్రమాదంలో కాలిపోయిందా అన్నారు. మాయమైన ఆరు గ్యారంటీల ఫైలు వెతికి కనిపెట్టేందుకు ఒక SIT వేయాలని ఎద్దేవా చేశారు. టీహబ్ అంటే చాయ్ అమ్ముకునే దుకాణం అనుకున్నారేమోనని కేటీఆర్​ అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు టీహబ్‌లోకి తరలించాలని అధికారులు ఆదేశించి మళ్లీ గంటల వ్యవధిలోనే ఆదేశాలు వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. మంత్రులు, ముఖ్యమంత్రికి తెలియకుండా ఆదేశాలు వస్తున్నాయని విమర్శించారు. అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు.

KTR Fire on Congress | ఎవరు చెప్పింది నిజం

ఐటీ ఎగుమతులు రూ.3.13 లక్షల కోట్లకు చేరుకున్నాయని, ఐటీ ఉద్యోగాలు 9 లక్షల 39 వేలకు చేరుకున్నాయని గవర్నర్ ప్రసంగంలో చెప్పారన్నారు. 2023–24 సంవత్సరాల్లో 9 లక్షల 46 వేలు ఐటీ ఉద్యోగాలు ఉన్నాయని ప్రభుత్వం చెప్పిందన్నారు. శ్రీధర్ బాబు ఏమో ఐటీ ఎగుమతులు 3 లక్షల 60వేల కోట్లు అన్నారని, అసలు ఏది నిజమని కేటీఆర్​ ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి..: Kukatpally Cash Robbery | కళ్లలో కారం చల్లి.. రూ.21 కోట్లు ఎత్తుకెళ్లారు

Revanth Reddy on Women Safety | మహిళల రక్షణకు చర్యలు : సీఎం రేవంత్​రెడ్డి
March 25 Horoscope | నూతన ఒప్పందాలతో వ్యాపార విస్తరణ.. ఈ రాశుల వారికి గోల్డెన్ ఛాన్స్!
driving license grading points | డ్రైవింగ్​ లైసెన్స్​కు ఇక గ్రేడింగ్​ పాయింట్లు.. తప్పుల పుట్ట పెరిగితే లైసెన్స్​ రద్దు
Jharkhand Air Ambulance Crash | కూలిపోయిన ఎయిర్​ అంబులెన్స్​.. ఏడుగురు మృతి
Seed Farmers Justice | సీడ్​ రైతులకు న్యాయం చేయాలి : కవిత
TAGGED:Cabinet MeetingCM Revanth ReddyCongress GovernmentKTRKTR Fire on Congress
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article India Dairy Consumption India Dairy Consumption | భారతీయ గృహ పోషణలో డైరీ విప్లవం: 75.8 శాతం మంది యాక్టివ్ వినియోగదారులే!
Next Article Pakistan Kabul Airstrike Pakistan Kabul Airstrike | అఫ్గానిస్థాన్​పై పాక్​ దాడి పిరికిపంద చర్య : భారత్‌
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?