అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR New York Speech | మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధి గురించి ఆయన మాట్లాడారు.
వారం రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం కేటీఆర్ అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. న్యూయార్క్ నగరంలోని కొలంబియా యూనివర్సిటీలో జరిగిన 21వ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ (India Business Conference)లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ అద్భుతమైన అభివృద్ధి గురించి తన అనుభవాలను పంచుకున్నట్లు కేటీఆర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
KTR New York Speech | పోరాటాల నుంచి..
తెలంగాణ పోరాటం, త్యాగాల చి ఆవిర్భవించిందని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ సమర్థవంతమైన నాయకత్వంలో, ఒక దశాబ్దంలోనే దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కొలంబియా ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ 2026లో వ్యాపారం, ఆవిష్కరణలు, భవిష్యత్ విధానాలపై జరిగిన లోతైన చర్చ స్ఫూర్తిదాయకంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక అద్భుతమైన వేదికగా మార్చిన నిర్వాహకులకు, హాజరైన ప్రతి ఒక్కరికీ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి : DSP Transfers State | తెలంగాణ రాష్ట్రంలో పలువురు డీఎస్పీల బదిలీ
