Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: KTR on Six Guarantees | ఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో నిలదీస్తాం : కేటీఆర్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - KTR on Six Guarantees | ఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో నిలదీస్తాం : కేటీఆర్​

తెలంగాణ

KTR on Six Guarantees | ఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో నిలదీస్తాం : కేటీఆర్​

ఆరు గ్యారంటీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని​ కేటీఆర్​ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేట్​ మెంబర్​ బిల్లు పెడతామన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 10, 2026 6:25 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
KTR on Six Guarantees

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR on Six Guarantees | బడ్జెట్​ సమావేశాల్లో (Budget Sessions) ఆరు గ్యారంటీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్​ఎస్ (BRS)​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంగళవారం వర్క్​షాప్​ నిర్వహించారు.

Contents
  • KTR on Six Guarantees | అబద్ధాలు మాట్లాడుతూ..
    • KTR on Six Guarantees | ప్రైవేట్​ బిల్లు పెడతాం

బడ్జెట్​ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్​ఎస్​ సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ వర్క్​షాప్​నకు బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్లు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, అసెంబ్లీ విప్ వివేకానంద తదితరులు హాజరు అయ్యారు. వర్క్​షాప్​ అనంతరం కేటీఆర్​ మీడియాతో మాట్లాడారు.

KTR on Six Guarantees | అబద్ధాలు మాట్లాడుతూ..

రాష్ట్రంలో బుల్డోజర్లను పంపి ఇళ్లను కూలగొడుతున్న తీరుగానే శాసనసభ (Assembly)లోనూ మంద బలంతో బుల్డోజర్ టాక్టిక్స్​ని కాంగ్రెస్ ప్రభుత్వం వాడుతుందని కేటీఆర్​ విమర్శించారు. శాసనసభ, శాసనమండలిలో సైతం అబద్ధాలను, అసత్యాలను మాట్లాడుతూ అంకెలను తారుమారు చేస్తూ సమావేశాలను తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలకు మొదటి క్యాబినెట్ సమావేశంలోనే చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ రెండన్నర సంవత్సరాల తర్వాత కూడా అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

brs

KTR on Six Guarantees | ప్రైవేట్​ బిల్లు పెడతాం

అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్​ఎస్​ తరఫున ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశ పెడతామని కేటీఆర్​ అన్నారు. ఆరు గ్యారంటీల అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. కోటి 67 లక్షల మంది మహిళలకు ఇస్తామన్న రూ.2500 కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా అసెంబ్లీలో కమిటీలను వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలెక్ట్ కమిటీ, స్టాండింగ్ కమిటీ, పిటిషన్స్ కమిటీ లేవన్నారు. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ (Deputy Speaker)​ సైతం లేరని.. తూతూ మంత్రంగా ప్రభుత్వం సమావేశాలు నిర్వహిస్తోందన్నారు.

ఇది కూడా చదవండి : Temple Circuit | బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్

Bhadrachalam Kalyana Talambralu | భక్తుల ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు..
Maoists Surrender Revanth Reddy | అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరూ లొంగిపోవాలి: సీఎం రేవంత్​రెడ్డి
Disabled Protest Support | దివ్యాంగుల ‘ఛలో అసెంబ్లీ’ ముట్టడికి బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు..
Vikarabad Woman Constable Suicide | వికారాబాద్ జిల్లాలో విషాదం.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
Telangana Building Rules | తెలంగాణ బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు
TAGGED:Assembly budget sessionBRS PartyCongress GovernmentKTRPrivate Member BillSix GuaranteesTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Hyundai Verna 2026 Hyundai Verna 2026 | హ్యుందాయ్ సరికొత్త వెర్నా.. రూ. 10.98 లక్షల నుంచి ప్రారంభం
Next Article iQOO Z11x 5G iQOO Z11x 5G | ఐక్యూ నుంచి మరో ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే?
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?