అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kuldeep Yadav Reception | టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. తన చిరకాల స్నేహితురాలు వంశికా చద్దాతో (Vamshika Chadda) కలిసి మార్చి 14న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి జరిగిన మూడు రోజుల తర్వాత మార్చి 17న లక్నోలో ఘనంగా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. నగరంలోని అత్యంత విలాసవంతమైన సెంట్రమ్ హోటల్‌లో ఈ వేడుక జరిగింది.
Kuldeep Yadav Reception | యోగి ఆదిత్యనాథ్ స్వయంగా విచ్చేసి
ఈ గ్రాండ్ రిసెప్షన్‌కు క్రికెట్ ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) స్వయంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించడం విశేషంగా నిలిచింది. క్రికెట్ లోకం నుంచి గౌతమ్ గంభీర్, యశస్వి జైస్వాల్, శిఖర్ ధావన్ వంటి స్టార్లు కూడా ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు.
Kuldeep Yadav Reception | రాయల్ విందు.. ఆకట్టుకున్న వేడుక
ఈ రిసెప్షన్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం అక్కడ ఏర్పాటు చేసిన రాయల్ విందు. కుల్దీప్ యాదవ్ తన రిసెప్షన్‌లో పూర్తిగా శాకాహార వంటకాలను మాత్రమే వడ్డించాలని నిర్ణయించుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. నాన్-వెజ్‌కు తావు లేకుండా శాకాహార వంటకాలతోనే (Vegetarian Dishes) అతిథులను ఆకట్టుకున్నారు. స్టార్టర్స్‌లో పనీర్ టిక్కా, అక్రోట్ హరా భరా కబాబ్, చిల్లీ మష్రూమ్, వెజ్ స్ప్రింగ్ రోల్స్, రకరకాల పిజ్జాలు వడ్డించారు. వీటితో పాటు రోస్టెడ్ టమాటో సూప్, వివిధ రకాల సలాడ్లు కూడా మెనూలో చోటు చేసుకున్నాయి. మెయిన్ కోర్స్‌లో ఉత్తర భారత దేశపు సంప్రదాయ రుచులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దమ్ ఆలూ సబ్జీ, దాల్ తడ్కా, దాల్ మురాదాబాదీ, అంజీర్ కోఫ్తా కర్రీ వంటి వంటకాలు అతిథులను ఎంతో ఆకట్టుకున్నాయి.

Kuldeep Yadav Reception | రాజస్థానీ స్పెషల్ అయిన దాల్ బాటి చుర్మా
ముఖ్యంగా రాజస్థానీ స్పెషల్ అయిన దాల్ బాటి చుర్మా ఈ విందులో హైలైట్‌గా నిలిచింది. వీటితో పాటు నాన్, రోటి, లచ్చా పరాఠా, గార్లిక్ నాన్, స్టీమ్ రైస్ వంటి ఎన్నో వెరైటీలు కూడా అందుబాటులో ఉంచారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన అతిథుల రుచులను దృష్టిలో పెట్టుకుని మెనూను ప్రత్యేకంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. విందు ముగిసిన తర్వాత స్వీట్ల విభాగం కూడా అతిథులను ఆకట్టుకుంది. సంప్రదాయ స్వీట్లైన జిలేబీ, రసమలై, బాదం హల్వా, గులాబ్ జామూన్‌తో పాటు మోడ్రన్ డెజర్ట్స్ అయిన చాక్లెట్ వాల్‌నట్ బ్రౌనీ, యాపిల్ పై, పేస్ట్రీలను కూడా వడ్డించారు. అయితే మెనూలో కుల్దీప్ ప్రత్యేకంగా కోరి మరీ మాల్పువాను చేర్పించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మార్చి 14న జరిగిన వివాహ వేడుకలో యుజ్వేంద్ర చాహల్, తిలక్ వర్మ వంటి క్రికెటర్లు ఉత్సాహంగా డాన్స్ చేయడంతో వేడుక మరింత హైలైట్ అయిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి..: GVCC Cricket Championship | 3వ జీవీసీసీ క్రికెట్ ఛాంపియన్‌షిప్.. ఆర్కిటెక్ట్‌లు డిజైనర్ల కలయిక

