అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kuwait Indian Embassy | కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించడంతో ప్రాంతీయంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న ఇండియన్స్ అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) సూచించింది. ఈ మేరకు ఇండియన్ ఎంబసీ ఒక ప్రకటన విడుదల చేసింది. తాజా పరిణామాలను గమనిస్తూ, తగు జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది.

ప్రతి ఒక్క భారతీయుడు అప్రమత్తంగా ఉండాలి. స్థానిక భద్రతా నిబంధనలను, మార్గదర్శకాలను పాటించాలి.
ప్రసార మాధ్యమాలు..
కువైట్ ప్రభుత్వం చేసే అధికారిక ప్రకటనలను, ప్రసార మాధ్యమాలను ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి.
నిరంతర సేవలు:
ఇండియన్ ఎంబసీ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయి. సాధారణ సేవలు నిరంతరం అందిస్తారు.

సహాయం కోసం..
భారతీయులకు ఏదైనా సందేహాలున్నా, అత్యవసర సహాయం కావాలన్నా హెల్ప్‌లైన్ నంబర్: +965 65501946 , ఈమెయిల్: community.kuwait@mea.gov.in~ ద్వారా సంప్రదించవచ్చు.
ఇది కూడా చదవండి: Iran US Tensions | జెనీవా చర్చలు విఫలం.. ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు యథాతథం!

