అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ladakh Donation Auctions | అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధంతో పశ్చిమాసియా అతలాకుతలం అవుతోంది. ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) హతమైన తర్వాత పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా లడఖ్‌లో భారీ ప్రదర్శనలు నిర్వహించిన విషయం తెలిసిందే.
ప్రధానంగా ఇరాన్ పునర్నిర్మాణం పేరుతో జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతంలో విరాళాల సేకరణ జోరుగా సాగుతోంది. లడఖ్ (Ladakh)లోని కార్గిల్ ప్రాంతంలో షియా ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. వీరు గత నెలరోజులుగా విరాళాలు సేకరిస్తున్నారు. చిన్నచిన్న కానుకలను వేలం వేస్తూ భారీగా విరాళాలను సమీకరిస్తున్నారు. సేకరించిన విరాళాలను ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి (Iran Embassy) పంపిస్తున్నారు.
Ladakh Donation Auctions | కక్సర్‌లో గుడ్డు వేలం..
కార్గిల్ జిల్లా (Kargil District)లోని కక్సర్ గ్రామంలో గత వారం ఒక మహిళ మూడు కోళ్లను స్థానిక మసీదుకు విరాళంగా అందించింది. ఆ కోళ్లలో ఒకటి గుడ్డు పెట్టింది. మరిన్ని విరాళాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆ గుడ్డును వేలం వేశారు. రూ. 100 బిడ్‌తో వేలం ప్రారంభం కాగా.. జనం పోగవడంతో ధర పెరుగుతూ వచ్చింది. చివరికి ఓ వ్యక్తి ఆ గుడ్డును రూ. 6 వేలకు కొనుగోలు చేశారు.
Ladakh Donation Auctions | మరో గ్రామంలో ఆపిల్ వేలం..
కర్కిట్చూ అనే గ్రామం (Karkitchu village)లో ఇటీవల ఇలాగే ఇరాన్ పునరావాసం కోసం కానుకగా వచ్చిన ఒక ఆపిల్‌ను వేలం వేశారు. రూ. 200 లతో వేలం ప్రారంభమైంది. చివరికి ఓ వ్యాపారి దీనిని రూ. 1.05 లక్షలకు కొనుగోలు చేశాడు. ఇలా సేకరించిన విరాళాలను న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి పంపిస్తున్నారు. ఇరాన్ పునర్నిర్మాణానికి సహకరించినందుకు జమ్మూ కాశ్మీర్, కార్గిల్ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో సందేశాలను పోస్ట్ చేస్తోంది.
ఇది కూడా చదవండి..: Vande Bharat Food Issue | వందే భారత్ రైలు భోజనంలో పురుగు
