అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Lakshmi Narayana Kalyanam | నగరంలోని ముబారక్‌నగర్ (Mubarak Nagar) వీవీ నగర్ కాలనీలో భూలక్ష్మీ మాత మందిరంలో 19వ వార్షికోత్సవం (Bhulakshmi Temple) ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా లక్ష్మీనారాయణ కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో జరిపించారు. ఈ క్రతువులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు కల్యాణ్ శర్మ, వేద పండితులు రాజశేఖర్, సాయి ఆధ్వర్యంలో కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
Lakshmi Narayana Kalyanam | సుప్రభాత సేవతో ప్రారంభం..
భూలక్ష్మి మాత మందిరంలో (Nizamabad) ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ, అభిషేకాలు ప్రారంభమయ్యాయి. అనంతరం గోవులను ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు స్వామివారికి మహా మంగళ హారతి ఇచ్చారు. అనంతరం 9 గంటల నుంచి 10వరకు హోమాలు జరిగాయి.
Lakshmi Narayana Kalyanam | భక్తిశ్రద్ధలతో కల్యాణం
భక్తుల జయజయధ్వానాల మధ్య లక్ష్మీ నారాయణుడి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛరణలతో క్రతువును (spiritual news) పూర్తి చేశారు. ఈ సందర్భంగా భక్తులకు మహా అన్నదానం( annadanam) ఏర్పాటు చేశారు. అలాగే సాయంత్ర 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు మహాహారతి, పల్లకీ ఊరేగింపు జరుగునున్నాయి. భక్తులు కార్యక్రమానికి హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు.

