అక్షరటుడే, వెబ్‌డెస్క్ : land acquisition protest | పేదల భూముల భూముల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender ) సీఎం రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. కోహెడ భూ భాదితుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు ఆయన మద్దతు తెలిపారు.
రంగారెడ్డి (Rangareddy) జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు నివసిస్తున్నారని చెప్పారు. నాలుగు తరాలుగా ఆ భూములను దున్నుకొని జీవనం సాగిస్తున్న వారికి నాటి ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని తెలిపారు. ఆ భూములను మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకోవాలని చూస్తోందన్నారు. రింగ్ రోడ్డు పడుతున్నప్పుడు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములకు కూడా డబ్బులు ఇచ్చి తీసుకోవాలని మేము డిమాండ్ చేశాం. అప్పుడు అసైన్డ్ భూములు ఉన్న వారికి కూడా డబ్బులు వచ్చాయన్నారు. అసైన్డ్ భూములు అమ్ముకునే అధికారం లేదు కానీ అనుభవించే అధికారం శాశ్వతంగా ఉంటుందన్నారు. వాటిని గుంజుకునే అధికారం ఎవరికి లేదని పేర్కొన్నారు.
land acquisition protest | పరిహారం ఇవ్వాలి
కేసీఆర్ (KCR) వచ్చిన తర్వాత ఒక దరిద్రపు స్కీం తీసుకొచ్చాడని ఈటల అన్నారు. ల్యాండ్ పూలింగ్ (Land Pooling) పేరిట ఒక ఎకరం గుంజుకొని 400 గజాలు ఇచ్చారని విమర్శించారు. ఆనాడు కేసీఆర్ ఈ భూములు గుంజుకొని వారికి అన్యాయం చేశారని, ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నారని మండి పడ్డారు. షావుకారు గుట్టలకు సంబంధించిన భూములకు పరిహారం ఇవ్వకపోతే భరతం పడతామని హెచ్చరించారు. గతంలో తీసుకున్న భూములు చాలవు అన్నట్లు మళ్లీ కొన్ని భూములను సేకరించే యత్నం చేస్తున్నారన్నారు. బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
దీనిని కూడా చదవండి : urea shortage warning | యూరియా కొరత వచ్చే అవకాశం : సీఎం రేవంత్‌రెడ్డి

