అక్షరటుడే, వెబ్‌డెస్క్: Laughing Boy Viral | కటిక పేదరికం నుంచి వచ్చిన అరుణ్ కుమార్ ఆర్థిక ఇబ్బందుల వల్ల నాలుగో తరగతిలోనే చదువుకు ఫుల్స్టాప్ పెట్టాడు. పొట్ట కూటి కోసం కూలీ పనులకు వెళ్లాడు. ట్రక్కులు క్లీన్ చేస్తూ పొట్ట పోసుకునేవాడు. చిన్నప్పుడే కష్టాల సుడిలో మునిగిపోయిన అరుణ్ ఏనాడూ ఆత్మ విశ్వాసం కోల్పోలేదు.
Laughing Boy Viral | ఛాయ్ తాగుతూ..
ఇదిలా ఉండగా.. ఒకసారి టీ (తేనీరు) స్టాల్ వద్ద ఛాయ్ తాగుతూ ఏదో విషయం మీద గట్టిగా నవ్వినప్పుడు.. ఆ సన్నివేశాన్ని నెహ్రూ అనే డ్రైవర్ చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అరుణ్ రాత్రి రాత్రే విపరీతమైన ఆదరణ పొందాడు. ఈ వీడియోను నెట్టింట 98 మిలియన్ల మంది చూశారట. ఆ బాలుడి సహజమైన అమాయక నవ్వును ఆస్వాదించారట.
డ్రైవర్ నెహ్రూ కేవలం ఆ బాలుడి నవ్వును చిత్రీకరించడంతోనే సరిపెట్టుకోలేదు. ఆ బాలుడికి చేదోడుగా నిలిచి, చదివించడంతో తెలంగాణకు చెందిన ఈ అరుణ్.. పదో తరగతి పూర్తి చేసుకున్నాడు. అలా మొత్తానికి ఒక నవ్వు అతగాడి తలరాతనే మార్చేసింది.
ఇది కూడా చదవండి: Pomegranate Peel Benefits | తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా.. ఇందులో దాగున్న పోషకాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
