అక్షరటుడే, వెబ్‌డెస్క్: Lava Bold N2 Pro | దేశీయ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ (Smart Phones) తయారీ సంస్థ అయిన లావా మార్చి 31 మధ్యాహ్నం 12 గంటలకు మరో కొత్త మోడల్‌ను మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఐఫోన్ ప్రో మోడల్‌ను తలపించేలా ఉన్న Lava Bold N2 Pro ఫోన్ ధర రూ. 8 వేల లోపే కావడం గమనార్హం. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో దీనిని తీసుకువచ్చారు. ఇది ఫ్లిప్ కార్ట్ (Flipkart) తోపాటు కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. ఏప్రిల్ 6న సేల్ ప్రారంభం కానుంది. ఈ మోడల్ స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి.
డిస్‌ప్లే : 6.67 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్ ప్లే అమర్చారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1600 720 పిక్సల్స్ రిజల్యూషన్, ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంది.
Lava Bold N2 Pro | సాఫ్ట్‌వేర్ :
యునిసాక్ టీ7250 చిప్ సెట్‌తో కూడిన ఈ హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పనిచేస్తుంది.
Lava Bold N2 Pro | కెమెరా సెటప్ :
వెనకవైపు 50 ఏఐ మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ ఏఐ కెమెరా సెట్ అప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
Lava Bold N2 Pro | బ్యాటరీ సామర్థ్యం :
5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు.
వేరియంట్ : ఎలిప్స్ గ్రే, అరోరా గోల్డ్ కలర్స్‌లో 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సింగిల్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 7,999.
కార్డ్ ఆఫర్ : ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చేసే కొనుగోళ్లపై 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ అందించనున్నారు.
ఇది కూడా చదవండి..: April 2026 Money Rules | మనీ రూల్స్‌లో మెనీ చేంజెస్.. ఏప్రిల్ 1 నుంచి జరిగే మార్పులివే!
