Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Lavanya Tripathi Harassment | హీరోయిన్​ లావణ్య త్రిపాఠికి సోషల్​ మీడియాలో వేధింపులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Lavanya Tripathi Harassment | హీరోయిన్​ లావణ్య త్రిపాఠికి సోషల్​ మీడియాలో వేధింపులు

సినిమా

Lavanya Tripathi Harassment | హీరోయిన్​ లావణ్య త్రిపాఠికి సోషల్​ మీడియాలో వేధింపులు

హీరోయిన్​ లావణ్య త్రిపాఠి పోలీసులను ఆశ్రయించారు. తనను సోషల్​ మీడియాలో వేధిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 10, 2026 11:07 ఉద.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Lavanya Tripathi Harassment
Lavanya Tripathi Harassment

అక్షరటుడే, వెబ్​డెస్క్: Lavanya Tripathi Harassment | టాలీవుడ్​ హీరోయిన్, మెగా ఫ్యామిలీ కోడలు లావణ్య త్రిపాఠికి సోషల్​ మీడియాలో వేధింపులు వచ్చాయి. దీంతో ఆమె హైదరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసు (Hyderabad Cyber ​​Crime Police) లకు ఫిర్యాదు చేశారు.

Contents
  • Lavanya Tripathi Harassment | కేసు నమోదు
    • Lavanya Tripathi Harassment | రెచ్చిపోతున్న ఆకతాయిలు

నటి లావణ్య త్రిపాఠి (Actress Lavanya Tripathi) పలు సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆమె నాగబాబు కుమారుడు, హీరో వరుణ్​ తేజ్​ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే కొంతకాలంగా లావణ్యను ఇన్​స్టాగ్రామ్ అకౌంట్​ (Instagram Account)లో ఓ వ్యక్తి వేధిస్తున్నాడు. ‘పర్పుల్ క్రెయిన్ 00’ అనే ఖాతా ద్వారా తనపై, తన కుటుంబసభ్యులపై అసభ్య పోస్టులు, కామెంట్లలో దూషణలు చేస్తున్నారని లావణ్య పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుడిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Lavanya Tripathi Harassment | కేసు నమోదు

తనపై వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకొని, దూషణలకు పాల్పడిన పోస్టులను తొలగించాలని లావణ్య కోరారు. దీంతో పోలీసులు ఐటీ చట్టం సెక్షన్ 67, BNS 78,79 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అకౌంట్ వివరాల ఆధారంగా నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనపై అసభ్యకర పోస్టులు పెట్టడంతో పాటు కామెంట్లలో సైతం దూషిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను ట్రోల్ చేయడంతో పాటు మార్ఫింగ్​ ఫొటోలను పోస్టు చేస్తున్నారని ఆరోపించారు.

Lavanya Tripathi Harassment | రెచ్చిపోతున్న ఆకతాయిలు

సోషల్​ మీడియాలో కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ఫేక్​ అకౌంట్ల ద్వారా యువతులు, మహిళలను వేధిస్తున్నారు. సోషల్​ మీడియా (Social Media)లో మహిళలు ఫొటోలు, పోస్టులు పెడితే వాటి కింద అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారు. అలాగే పలువురు మహిళలకు నిత్యం మెసేజ్​లు పంపుతూ వేధింపులకు పాల్పడుతున్నారు. హీరోయిన్లు, నటులను సైతం వీరు వదలడం లేదు. అయితే పోకిరీలపై చాలా మంది ఫిర్యాదు చేయడం లేదు. దీంతో వారు మరింత రెచ్చిపోతున్నారు.

ఇది కూడా చదవండి..: Bellamkonda Srinivas Engagement | అది నిశ్చితార్థం కాదు.. కావ్యమ్మపై ప్రేమని వ్య‌క్తం చేస్తూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్

Shivaji Raja Father Death | సీనియర్ నటుడు శివాజీ రాజా తండ్రి కన్నుమూత.. శోక‌సంద్రంలో కుటుంబ స‌భ్యులు
Divvela Madhuri Controversy | మరో వివాదంలో దివ్వెల మాధురి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ
Kaushik Reddy Shock | బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డికి షాక్​!
Sai Pallavi Awards | చరిత్ర సృష్టించిన సాయి పల్లవి.. మూడు భాషల్లో ఏడు బ్లాక్ లేడీ అవార్డులు
Monalisa Love Marriage | తండ్రిపై కేసు పెట్టి.. ప్రియుడిని పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా
TAGGED:Actress Lavanya TripathiHyderabad Cyber ​​Crime PoliceInstagram AccountLavanya Tripathi HarassmentSocial Media
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Pakistan Fuel Crisis Pakistan Fuel Crisis | ఉద్యోగుల జీతాల్లో కోత.. పాఠశాలలకు సెలవులు.. పాక్​ కీలక నిర్ణయాలు
Next Article Kalvakuntla Kavitha arrest Kalvakuntla Kavitha arrest | కల్వకుంట్ల కవిత అరెస్ట్​.. జాగృతి కార్యాలయంలో దీక్ష కొనసాగింపు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?