అక్షరటుడే, వెబ్‌డెస్క్ : LB Nagar Car Accident | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తూ ఓ లారీని డివైడర్‌ను ఢీకొంది. అనంతరం కారు దగ్ధమైంది.
ఎల్‌బీనగర్‌లోని సాగర్ రింగ్ రోడ్డు (Sagar Ring Road) బ్రిడ్జిపై ఆదివారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాక్ టౌన్ కాలనీకి చెందిన సాయి కీర్తన్ రెడ్డి (24) తన కారులో అర్ధరాత్రి వెళ్తున్నాడు. అతివేగం, అజాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ.. సాగర్ రింగ్ రోడ్ వద్ద ఉన్న ఫ్లైఓవర్‌పై లారీని ఢీకొట్టాడు. అనంతరం కారు పల్టీలు కొట్టి డివైడర్‌ను, రెయిలింగ్‌ను ఢీకొంది.
ఈ ఘటనలో కారులో మంటలు చెలరేగాయి. దీంతో పూర్తిగా దగ్ధమైంది. అయితే సాయికీర్తన్ రెడ్డి ముందుగానే బయటకు రావడంతో అతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సాయి కీర్తన్తో పాటు కారులో మరికొందరు ఉన్నారు. ప్రమాద సమయంలో వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
LB Nagar Car Accident | గచ్చిబౌలిలో..
నగరంలోని గచ్చిబౌలిలో శనివారం ఓ యువకుడు బెంజ్ కారు (Benz Car)తో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. నార్సింగి పరిధిలో ఓ కారు ఢీకొన్న సదరు యువకుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఓ కానిస్టేబుల్ గచ్చిబౌలిలో ఆ కారును ఆపేందుకు యత్నించాడు. అయితే నిందితుడు కారును ఆపకుండా కానిస్టేబుల్‌ను ఢీకొని వెళ్లాడు. దీంతో కానిస్టేబుల్ కారు బానెట్‌పై ఉండిపోయారు. ఇతర వాహనదారులు సదరు కారును ఆపి పోలీసులకు అప్పగించారు. సదరు యువకుడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
LB Nagar Car Accident | మద్యం మత్తులో..
నగరంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు (Road Accidents) పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువత మద్యం మత్తులో అతివేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం అవుతున్నారు. బెంజ్, బీఎండబ్లూ వంటి కార్లు ఉన్న యువత స్నేహితులతో కార్లలో వెళ్తూ.. హంగామా చేస్తున్నారు. పూటుగా తాగి వాహనాలను వేగంగా నడిపిస్తూ ఇతరుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. పెద్ద కార్లలో సేఫ్టీ ఫీచర్లు బాగా ఉండటంతో.. ఇలాంటి ఘటనల్లో నిందితులు ప్రాణాలతో బయట పడుతున్నారు. అయితే వీరి మూలంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Traffic Relief | ట్రాఫిక్ రద్దీ నివారణకు చర్యలు : సీపీ సజ్జనార్

