Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Licensed Surveyors | లైసెన్స్​డ్​ సర్వేయర్లకు వేతనం ఇవ్వాలి : హరీశ్​రావు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Licensed Surveyors | లైసెన్స్​డ్​ సర్వేయర్లకు వేతనం ఇవ్వాలి : హరీశ్​రావు

తెలంగాణ

Licensed Surveyors | లైసెన్స్​డ్​ సర్వేయర్లకు వేతనం ఇవ్వాలి : హరీశ్​రావు

లైసెన్స్​డ్​ సర్వేయర్లకు గౌరవ వేతనం చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్​రావు డిమాండ్​ చేశారు. కమీషన్​ పేరిట వారిని మోసం చేయొద్దన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 1, 2026 8:55 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Licensed Surveyors

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Licensed Surveyors | లైసెన్స్​డ్​ సర్వేయర్లకు గౌరవ వేతనం చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) డిమాండ్​ చేశారు. కాంగ్రెస్​ ప్రభుత్వం లైసెన్స్​డ్ సర్వేయర్ల పేరిట ప్రజలను నమ్మించి నట్టేటా ముంచిందన్నారు.

Contents
  • Licensed Surveyors | మాయ మాటలు చెప్పి..
    • Licensed Surveyors | అండగా ఉంటాం
      • అవినీతి పెరిగే అవకాశం

రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం లైసెన్స్​డ్​ సర్వేయర్ల నియామకం చేపట్టిన విషయం తెలిసిందే. ఎంతో మంది దీని కోసం దరఖాస్తు చేసుకోగా.. పరీక్ష పెట్టి అర్హులను ఎంపిక చేసింది. అనంతరం వారికి నియామక పత్రాలు అందించి, శిక్షణ కూడా ఇచ్చింది. అయితే వారికి వేతనాలు కాకుండా భూముల సర్వే ఆధారంగా కమీషన్​ ఇస్తామని తెలిపింది. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు తమ సమస్యను మాజీ మంత్రి హరీశ్​రావు దృష్టికి తీసుకెళ్లారు.

Licensed Surveyors | మాయ మాటలు చెప్పి..

ప్రభుత్వం చెప్పిన మాయమాటలు నమ్మి.. చేస్తున్న ప్రైవేట్, ఐటీ ఉద్యోగా (IT Jobs) లు వదిలేసుకుని వచ్చిన 6,500 మంది లైసెన్స్​డ్​  సర్వేయర్లను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) నట్టేట ముంచిందని హరీశ్​రావు విమర్శించారు. మంచి జీతం ఇస్తామని ఆశపెట్టి, శిక్షణ ఇచ్చి, ప్రమాణ స్వీకారాలు చేయించి.. తీరా ఇప్పుడు ఎకరం సర్వే చేస్తే 10 రూపాయల కమీషన్ ఇస్తామనడం విద్యావంతులైన యువతను అవమానించడమే అన్నారు. ఏడాది పొడవునా కష్టపడి రెండు వేల ఎకరాలు సర్వే చేసినా వీరికి వచ్చేది రూ.20 వేలే అన్నారు.

Licensed Surveyors | అండగా ఉంటాం

సిద్దిపేట (Siddipeta)లో తనను కలిసి గోడు వెళ్లబోసుకున్న సర్వేయర్లకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హరీశ్​రావు హామీ ఇచ్చారు. ప్రభుత్వం కమీషన్ల పేరుతో వాళ్ల జీవితాలతో ఆడుకోకుండా.. తక్షణమే గౌరవ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్​ చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సర్వేయర్ల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

అవినీతి పెరిగే అవకాశం

ప్రస్తుతం రెవెన్యూశాఖలో భారీగా అవినీతి జరుగుతోంది. తహశీల్దార్​ కార్యాలయాల్లో పలువురు అటెండర్ల​ నుంచి తహశీల్దార్ల వరకు లంచాల పేరిట ప్రజలను వేధిస్తున్నారు. సర్వేయర్లు అయితే డబ్బులు ఇస్తేనే సర్వేకు వస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన లైసెన్స్​డ్​ సర్వేయర్లకు జీతాలు ఇవ్వకపోతే వారు రైతులను మామూళ్లు అడిగే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

surveyors

దీనిని కూడా చదవండి : Bulldozer Rajyam | రాష్ట్రంలో బుల్డోజర్​ రాజ్యం నడుస్తోంది : కేటీఆర్​

Congress Policies Criticism | కాంగ్రెస్​ మోసపూరిత విధానాలను ప్రజలకు వివరిస్తాం..
Telangana Hailstorm Rain | పలు​ జిల్లాల్లో వడగళ్ల వాన.. ఆందోళనలో రైతులు
ACB Corruption Arrest | ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్​ సీఐ, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
Licensed Surveyors Wages | వేతనాలు లేక అవస్థలు.. కేటీఆర్‌ను కలిసిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు
Okha Tirupati Express | ఓఖా–తిరుపతి వీక్లీ ఎక్స్​ప్రెస్​లో మార్పులు
TAGGED:BRS PartyCongress GovernmentHarish RaoLand survey controversyLicensed surveyorsRevenue departmentSurveyor salary issueTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Iran Massive Attacks Warning Iran Massive Attacks Warning | పెద్ద ఎత్తున దాడులు చేస్తాం.. ఇరాన్​ వార్నింగ్​
Next Article Pakistan Afghanistan Border Clash : 400 మందికి పైగా తాలిబాన్ సైనికులు మరణించారు.. 46 ప్రదేశాలు దెబ్బతిన్నాయి: పాక్ మంత్రిPakistan Afghanistan Border Clash : 400 మందికి పైగా తాలిబాన్ సైనికులు మరణించారు.. 46 ప్రదేశాలు దెబ్బతిన్నాయి: పాక్ మంత్రి Pakistan Afghanistan Border Clash : 400 మందికి పైగా తాలిబాన్ సైనికులు మరణించారు.. 46 ప్రదేశాలు దెబ్బతిన్నాయి: పాక్ మంత్రి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?