అక్షరటుడే, ఎల్లారెడ్డి : Life Sciences Seminar | లైఫ్ సైన్సెస్ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, ఆధునిక పరిశోధనలు, శాస్త్రీయ దృక్పథం ద్వారా మానవ జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవచ్చని వక్తలు పేర్కొన్నారు.
పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Government Degree College)లో కెమిస్ట్రీ, బాటనీ విభాగాల ఆధ్వర్యంలో ‘కెమికల్, లైఫ్ సైన్సెస్‌లో వస్తున్న మార్పులు – సవాళ్లు’ అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్, సెమినార్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
Life Sciences Seminar | ఉస్మానియా యూనివర్సిటీ..
ఈ సదస్సులో ఉస్మానియా విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ శశికళ గారు కీనోట్ స్పీకర్‌గా హాజరై ప్రసంగించారు. లైఫ్ సైన్సెస్ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, ఆధునిక పరిశోధనల ద్వారా మానవ జీవన ప్రమాణాలను ఎలా మెరుగుపరచవచ్చో ఆమె వివరించారు. మరో రిసోర్స్ పర్సన్, ఉస్మానియా విశ్వవిద్యాలయ అసోసియేట్ ప్రొఫెసర్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. కెమికల్ సైన్సెస్‌లో ఎదురవుతున్న సవాళ్లు, కొత్త ఆవిష్కరణల గురించి లోతైన విశ్లేషణ చేశారు. విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, ప్రయోగాత్మక పరిశోధనల వైపు మొగ్గు చూపాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫలక్‌నుమా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ లైఫ్ సైన్స్‌లో ఆధునిక పద్ధతుల గురించి వివరించి అందరూ కూడా పరిశోధన వైపు ఆలోచన దృక్పథం ఉండాలని కోరారు.

Life Sciences Seminar | జాతీయ సదస్సులు గొప్ప అవకాశం..
కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ (College Principal Lakshminarayana) మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇలాంటి జాతీయ స్థాయి సదస్సులు గొప్ప అవకాశమని, సబ్జెక్టు నిపుణులతో చర్చించడం ద్వారా వారిలో శాస్త్రీయ అవగాహన పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సెమినార్ కన్వీనర్ అరుణ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గోదావరి, సెమినార్ కో–కన్వీనర్స్ శశిధర్, చంద్రకాంత్, వైస్ ప్రిన్సిపల్ చంద్రకాంత్, ఐక్యూఏసీ సమన్వయకర్త శంకరయ్య, టీఎస్కేసీ సమన్వయకర్త శివకుమార్, కళాశాల సూపరింటెండెంట్ వసంత లక్ష్మి, కళాశాల అధ్యాపకులు, వివిధ కళాశాలల నుండి వచ్చిన, అధ్యాపకులు, పరిశోధకులు, కళాశాల, అధ్యాపకేతర బృందం విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: ASHA Workers Protest | ఆశ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సీఐటీయూ డిమాండ్

