Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Lifestyle Diseases Awareness | జీవనశైలిలో మార్పులతోనే అనారోగ్య సమస్యలు: మెడికవర్​ హాస్పిటల్​ డాక్టర్​​ ఆనంద్​ మాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Lifestyle Diseases Awareness | జీవనశైలిలో మార్పులతోనే అనారోగ్య సమస్యలు: మెడికవర్​ హాస్పిటల్​ డాక్టర్​​ ఆనంద్​ మాలు

నిజామాబాద్

Lifestyle Diseases Awareness | జీవనశైలిలో మార్పులతోనే అనారోగ్య సమస్యలు: మెడికవర్​ హాస్పిటల్​ డాక్టర్​​ ఆనంద్​ మాలు

జీవనశైలిలో మార్పులతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని మెడికవర్​ హాస్పిటల్స్ డాక్టర్​ ఆనంద్​ మాలు అన్నారు. సరైన ఆహారం తీసుకొని, వ్యాయామం చేయాలని సూచించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 6, 2026 3:31 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Lifestyle Diseases Awareness

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్ ​: Lifestyle Diseases Awareness | ప్రస్తుత జీవనశైలిలో మార్పుల కారణంగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని మెడికవర్​ హాస్పిటల్స్​ జనరల్​ ఫిజీషియన్​ ఆనంద్​ మాలు అన్నారు. ఏప్రిల్​ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం(World Health Day) సందర్భంగా హాస్పిటల్​లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

Contents
  • Lifestyle Diseases Awareness | ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన..
    • Lifestyle Diseases Awareness | సమతుల్య ఆహారం తీసుకోవడంతో

Lifestyle Diseases Awareness | ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన..

డాక్టర్​ ఆనంద్​ (General Physician Anand) మాలు​ మాట్లాడుతూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) పిలుపు మేరకు ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుత జీవనశైలిలో మార్పులతో మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధిత వ్యాధులు వంటి సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని పేర్కొన్నారు. సరైన ఆహారం, వ్యాయామం, మానసిక ప్రశాంతత ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని సూచించారు. ఈ మేరకు మెడికవర్ హాస్పిటల్​లో ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.

Lifestyle Diseases Awareness | సమతుల్య ఆహారం తీసుకోవడంతో

ప్రతి ఒక్కరూ సమతుల్య ఆహారం తీసుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలని అన్నారు. మధుమేహం (Diabetes), రక్తపోటు వంటి వ్యాధులను నిర్లక్ష్యం చేయకుండా, నిరంతర వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అదేవిధంగా శరీరానికి తగినంత నీరు తీసుకోవడం, జంక్ ఫుడ్‌ను తగ్గించడం అవసరమని తెలిపారు. అనంతరం ఫిజీషియన్​ అంజలి మాట్లాడుతూ.. మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని పేర్కొన్నారు. ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, ధ్యానం చేయాలని సూచించారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకూడదని, ముఖ్యంగా మహిళలు, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణకు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంటర్ హెడ్ స్వామి, డీఎంఎస్​ యజ్ఞ, మార్కెటింగ్ హెడ్ వినయ్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Illegal Sand Mining | మొరం అక్రమ తవ్వకాలపై సీసీఎస్​ పోలీసుల మెరుపుదాడి

Domestic Cylinders Seized | హోటళ్లపై సివిల్ సప్లయ్స్​ అధికారుల దాడులు.. డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం
Life Sciences Seminar | నిత్య నూతనం.. శాస్త్రీయ దృక్పథం..
HPV Vaccine Distribution | హెచ్​పీవీ టీకా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
Kamareddy SI Retirement | ఇద్దరు ఎస్సైల పదవీ విరమణ
Banswada Bus Stand Repairs | బాన్సువాడ బస్టాండ్​కు మరమ్మతులు చేపట్టాలి: ఎమ్మెల్యే పోచారం
TAGGED:blood pressurediabetes preventionhealth awarenesshealthy lifestylelifestyle diseasesLifestyle Diseases Awarenessmedicaover hospitalpublic healthworld health day
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article IRGC Intelligence Chief IRGC Intelligence Chief | ఇరాన్​కు షాక్​.. ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మృతి
Next Article Lungs Transport Operation Lungs Transport Operation | బెంగళూరు నుంచి ఊపిరితిత్తులు.. గ్రీన్​ఛానెల్​ ఏర్పాటు చేసిన పోలీసులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?