అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Liquor Ban in Nizamabad | హనుమాన్ జయంతి(Hanuman Jayanti) నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని మద్యం దుకాణాలు(Nizamabad news)బంద్ చేసేలా ఆదేశాలు జారీ చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం (liquor ban) ప్రకటన విడుదల చేశారు.
Liquor Ban in Nizamabad | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో..
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లోని నిజామాబాద్, ఆర్మూర్(Armoor), బోధన్ డివిజన్(Bodhan news) పరిధిలో సెక్షన్ 20(1) తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ 1968(excise act) ప్రకారం హనుమాన్ జయంతి పండుగ నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలలో (Telangana police) భాగంగా జిల్లాలో గల కల్లు దుకాణాలు, కల్లు డిపోలు, ఐఎంఎల్ (ఏ4) షాప్లు, బార్లు, క్లబ్బులు, టీడీ–1, సీఎస్–2లు అన్నీ కూడా ఈనెల 2వ తేదీ ఉదయం 6గంటల నుంచి 3వ తేదీ ఉదయం 6గంటల వరకు మూసి వేస్తున్నట్లు తెలిపారు.
