Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Loan Apps | లోన్​ యాప్స్​కు మరో యువకుడు బలి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Loan Apps | లోన్​ యాప్స్​కు మరో యువకుడు బలి

ఆంధ్రప్రదేశ్​

Loan Apps | లోన్​ యాప్స్​కు మరో యువకుడు బలి

అప్పుల బాధతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని కాకినాడలో చోటు చేసుకుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 28, 2026 11:34 ఉద.
Srinivas Kolluri
6 గంటలు ago
Share
Loan Apps

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Loan Apps | లోన్​ యాప్స్​ ఉచ్చులో చిక్కుకొని మరో యువకుడు బలి అయ్యాడు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh)లోని కాకినాడలో చోటు చేసుకుంది.

Contents
  • Loan Apps | మంచి కొడుకుగా ఉండలేకపోయా
    • Loan Apps | విద్యార్థులే లక్ష్యంగా..
      • Loan Apps | డబ్బుల కోసం వేధింపులు

ఒడిశాకు చెందిన మహ్మద్​ బషీర్ (22) కాకినాడ జిల్లా (Kakinada District) గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో చదువుతున్నాడు. అతడు ఆన్​లైన్​ బెట్టింగ్​కు బానిస అయ్యాడు. దీంతో భారీగా డబ్బులు నష్టపోయాడు. ఈ క్రమంలో పోయిన డబ్బులు తిరిగి రాబట్టుకోవాలని లోన్​ యాప్​ల ద్వారా అప్పులు తీసుకున్నాడు. వాటితో ఆన్​లైన్​ బెట్టింగ్​ (Online Betting) పెట్టగా.. అవికూడా పోయాయి. దీంతో అప్పులు ఎక్కువ కావడంతో వాటిని ఎలా తీర్చలో తెలియక మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో హాస్టల్​ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Loan Apps | మంచి కొడుకుగా ఉండలేకపోయా

బషీర్​ సూసైడ్​ నోట్ ప్రతి ఒక్కరిని కలిచి వేస్తోంది. అమ్మ నన్ను క్షమించు.. మంచి కొడుకుగా ఉండలేకపోయా.. నా కోసం ఎంతో కష్టపడ్డ నీకు మళ్లీ భారాన్ని మిగిల్చాను అంటూ తల్లికి లేఖ రాసి తనువు చాలించాడు. అప్పుల నుంచి బయటపడే మార్గం కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Loan Apps | విద్యార్థులే లక్ష్యంగా..

ఆన్​లైన్​ బెట్టింగ్​ను ప్రభుత్వం నిషేధించింది. అయినా కూడా బెట్టింగ్​ జోరుగా సాగుతోంది. అలాగే లోన్​ యాప్​లపై ఆర్బీఐ (RBI) కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా… అనేక యాప్​లు పుట్టుకొస్తున్నాయి. యువత, విద్యార్థులే లక్ష్యంగా ఈ యాప్​లో రుణాలు ఇస్తున్నాయి. సాధారణంగా రుణ సంస్థలు, బ్యాంకులు ఉద్యోగులు, ఆర్థిక భరోసా ఉన్న వారికి అప్పులు ఇస్తాయి. లోన్​ యాప్​లు మాత్రం విద్యార్థులు, యువతకు అడిగినంత లోన్లు ఇస్తున్నాయి. అయితే వాటితో పలువురు బెట్టింగ్​లు, ఆన్​లైన్​ గేమ్స్​, ఇతర జల్సాలు చేస్తున్నారు.

Loan Apps | డబ్బుల కోసం వేధింపులు

అప్పులు తీసుకున్న వారు వాటిని తిరిగి తీర్చలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. లోన్​ యాప్​ల్లో వడ్డీ సైతం అధికంగా ఉంటుంది. తిరిగి చెల్లించకపోతే యాప్​ నిర్వాహకులు వేధింపులకు పాల్పడుతున్నారు. సదరు వ్యక్తి తల్లిదండ్రులు, బంధువులకు ఫోన్​ చేసి తీసుకున్న అప్పు గురించి చెబుతున్నారు. దీంతో పరువు పోతుందని పలువరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. లోన్ యాప్​లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ముఖ్యంగా ఈ మధ్యకాలంలో విద్యార్థులే లక్ష్యంగా సాగుతున్న లోన్ యాప్‌ల వేధింపులు, అధిక వడ్డీలు యువతను బలవన్మరణాలకు ప్రేరేపిస్తున్నాయి. సులభంగా డబ్బు వస్తుందన్న ఆశతో మొదలై, చివరకు అది ప్రాణాలు తీసే స్థాయికి చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఇది కూడా చదవండి : Markapuram Bus Accident | మార్కాపురం బస్సు ప్రమాదం.. 13కు చేరిన మృతుల సంఖ్య

 

Ice Cream Ban Guduru | ఐస్‌క్రీం బండ్లకు నో చెప్పిన గ్రామం.. గూడూరు ప్రజల వినూత్న నిర్ణయంపై ప్ర‌శంస‌లు
Putta Mahesh | డ్రగ్స్​ ఆరోపణలపై పార్టీ అధిష్ఠానం సీరియస్​.. ఎంపీ పుట్టా వివరణ!
H J Dora Death | మాజీ డీజీపీ హెచ్​జె దొర మృతి.. సంతాపం తెలిపిన సీఎం
QNet Fraud Raids | ఎంఎల్​ఎం సంస్థ క్యూనెట్​పై సీసీఎస్​ దాడులు
Snake Bite Incident | కాటేసిన పాముతో హాస్పిటల్​కు వెళ్లిన వ్యక్తి
TAGGED:Andhra Pradeshdebt trap youthfinancial fraud appsKakinada DistrictKakinada newsLoan Appsloan harassment IndiaOnline Bettingonline betting addictionRBIstudent suicide Indiayouth issues India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Musi River Cleanup Musi River Cleanup | మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం : సీఎం రేవంత్​రెడ్డి
Next Article Footpath Encroachments Footpath Encroachments | ఫుట్​పాత్ ఆక్రమణలపై ఉక్కుపాదం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?