అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Lockdown Rumors | పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల క్రూడ్ ఆయిల్, గ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో ప్రపంచం ఇంధన సమస్య ఎదుర్కొంటోంది. దేశంలో ఇప్పటికైతే పెట్రోల్, డీజిల్ కొరత లేనప్పటికీ ఎల్‌పీజీ షార్టేజ్ (LPG Shortage) కనిపిస్తోంది. దీంతో సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ విధించవచ్చనే వదంతులు వ్యాపిస్తున్నాయి.
పెట్రోల్, డిజిల్ ను ఆదా చేసేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ విధించవచ్చంటూ శివసేన సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యాలు భయాలను పెంచాయి. మరోవైపు ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ (Prime Minister Modi) వర్చువల్ మీటింగ్ నిర్వహించనున్నారు. పశ్చిమ ఆసియా యుద్ధం వల్ల భారతదేశంపై ఏమైనా ప్రభావం ఉంటుందా, ఎల్‌పీజీ, ఆయిల్ సరఫరా ఎలా ఉంది అనే అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కరోనా సమయంలో ఎదురైన సప్లై చైన్ సమస్యలను ప్రస్తావించడంతో ఈ రూమర్స్ మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఊహాగానాలు పెరిగిపోతున్నాయి.
Lockdown Rumors | పలు దేశాలలో ఎనర్జీ లాక్ డౌన్ ?
ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధం నాలుగు వారాలుగా కొనసాగుతుండడం, హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) నుంచి నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సమస్య ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఇంధన సమస్యను తగ్గించడానికి కొన్ని దేశాలు ఇప్పటికే పలు ఆంక్షలు విధించాయి. ఫిలిప్పీన్స్, శ్రీలంక, పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, మయన్మార్, ఈజిప్ట్ వంటి దేశాలు పెట్రోల్, డిజీల్, విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు ప్రకటించాయి. పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు, ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్ చేయాలని ఆదేశాలు జారీ చేశాయి. పెట్రోల్, డీజిల్ ఎక్కువ కొనకుండా పరిమితులు విధించాయి.
Lockdown Rumors | ఖండించిన కేంద్రం
మన దేశంలో లాక్ డౌన్ వదంతులపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అలాంటి ప్రతిపాదనలు ఏమీ లేవని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టత ఇచ్చారు. ఇలాంటి రూమర్స్ వ్యాప్తి చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం బాధ్యతారహితమైన హానికరమైన చర్య. అని ఆయన అభివర్ణించారు. ‘క్లిష్ట సమయంలో మనం ప్రశాంతంగా, బాధ్యతగా మరియు ఐక్యంగా ఉండాలి. రూమర్స్ వ్యాప్తి చేయడం చాలా తప్పు. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ సరఫరా సాధారణంగానే ఉంది. దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకులు సాధారణంగా నడుస్తున్నాయి’ అని మంత్రి హర్దీప్ పూరి వివరించారు. దేశంలో కోవిడ్ తరహా లాక్‌డౌన్ విధించే అవకాశమే లేదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. కొంతమంది రాజకీయా నాయకులు లాక్‌డౌన్ గురించి మాట్లాడి ప్రజలను భయపెట్టడం బాధాకరం అన్నారు.
ఇది కూడా చదవండి : PF Withdrawal App | పీఎఫ్ ఉపసంహరణ మరింత సులభం.. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి కొత్త మొబైల్ యాప్

