Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Lok Sabha No Confidence | లోక్‌సభ స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై చర్చ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Lok Sabha No Confidence | లోక్‌సభ స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై చర్చ

జాతీయం

Lok Sabha No Confidence | లోక్‌సభ స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై చర్చ

Srinivas kolluri
Last updated: మార్చి 10, 2026 1:48 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Lok Sabha No Confidence
Lok Sabha No Confidence

అక్షరటుడే, వెబ్​డెస్క్: Lok Sabha No Confidence | లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Lok Sabha Speaker Om Birla)పై అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ ప్రారంభం అయింది. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు (Union Minister Kiren Rijiju) చర్చను ప్రారంభించారు. చర్చ కోసం 10 గంటలు కేటాయించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ విపక్ష సభ్యులు కేసీ వేణుగోపాల్, అసద్ లేవనెత్తగా.. ప్యానెల్ స్పీకర్ జగదాంబిక పాల్ తిరస్కరించారు.

Contents
  • Lok Sabha No Confidence | లోక్​సభ గౌరవం కోసం..
    • Lok Sabha No Confidence | ప్రధాని మద్దతు

కాంగ్రెస్ ఎంపీ మహమూద్ జావేద్ (Congress MP Mahmood Javed) అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. చర్చ అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) మాట్లాడనున్నారు. స్పీకర్​ స్థానంలో బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ కూర్చున్నారు. చర్చకు 10 గంటలు కేటాయించినట్లు చెప్పారు. తీర్మానానికి కట్టుబడి ఉండాలని ఎంపీలను కోరారు.

Lok Sabha No Confidence | లోక్​సభ గౌరవం కోసం..

కాంగ్రెస్​ ఎంపీ గౌరవ్​ గొగోయ్​ మాట్లాడుతూ.. ఈ తీర్మానం ఓం బిర్లాను లక్ష్యంగా చేసుకోవడం కోసం కాదన్నారు. తాము లోక్‌సభ గౌరవాన్ని కాపాడాలనుకుంటున్నామని చెప్పారు. స్పీకర్​ ఓంబిర్లాపై పలువురు ప్రతిపక్ష నాయకులు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఆయన పక్షపతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లోక్‌సభలో కొన్ని “ఊహించని చర్యలు” గురించి స్పీకర్ మాట్లాడినప్పుడు, కాంగ్రెస్ సభ్యులపై కొన్ని తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.

Lok Sabha No Confidence | ప్రధాని మద్దతు

ప్రతిపక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినప్పటి నుంచి స్పీకర్ బిర్లా సభ కార్యకలాపాల నుంచి తప్పుకున్నారు. లోక్‌సభ సెక్రటేరియట్ అజెండా ముగిసిన తర్వాతే తాను తిరిగి వస్తానని తెలిపారు. కాంగ్రెస్​ ఎంపీ డాక్టర్ మొహమ్మద్ జావేద్ మాట్లాడుతూ.. సభలోని అన్ని వర్గాల విశ్వాసాన్ని పొందేందుకు అవసరమైన నిష్పాక్షికతను కొనసాగించడంలో స్పీకర్​ విఫలం అయ్యారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడిని, ఇతర ప్రతిపక్ష నాయకులను మాట్లాడకుండా స్పీకర్ అడ్డుకున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష మహిళా ఎంపీలపై అనవసర ఆరోపణలు చేశారని విమర్శించారు.

ఇది కూడా చదవండి..: LPG Booking Interval | గ్యాస్​ సిలిండర్ల బుకింగ్​పై కేంద్రం కీలక నిర్ణయం

Nayara Fuel Price Hike | పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచిన ‘నయారా’
LPG Supply Update | గ్యాస్​ కొరత లేదు.. 10 శాతం​ ఉత్పత్తి పెరిగింది..: కేంద్ర ప్రభుత్వ వర్గాలు
Monalisa Love Marriage | తండ్రిపై కేసు పెట్టి.. ప్రియుడిని పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా
India UAE Talks | యూఏఈ ప్రెసిడెంట్​కు మోడీ ఫోన్​.. ఏమేమి మాట్లాడుకున్నారంటే..!
Assembly Election Schedule | మోగిన నగారా.. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్​
TAGGED:Amit ShahBJPCongressCongress MP Mahmood JavedJagdambika PalLok SabhaLok Sabha Speaker Om BirlaNo Confidence MotionOm BirlaParliamentary DebateUnion Minister Kiren Rijiju
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Telangana New Governor Telangana New Governor | నూతన గవర్నర్​కు స్వాగతం పలికిన సీఎం రేవంత్​రెడ్డి
Next Article Temple Attack Allegation Temple Attack Allegation | కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆలయాలకు రక్షణ లేదు..: అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?