అక్షరటుడే, వెబ్‌డెస్క్: Lok Sabha Seats Increase | లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పెంపు అంశంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల్లోని స్థానాలను 50 శాతం పెంచనున్నట్లు సమాచారం. ఈ బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పార్లమెంటు స్థానాలు 543 నుంచి 816కు పెరగనున్నాయి. అలాగే 4,123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6,185కి చేరనున్నాయి.
Lok Sabha Seats Increase | తెలంగాణలో 179 స్థానాలకు..
తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో ప్రస్తుతం ఉన్న 119 స్థానాలు 179కి పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 175 స్థానాలు ఉండగా.. అవి 263కు చేరనున్నాయి. ఇక తెలంగాణలోని లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కు, ఏపీలోని ఎంపీ స్థానాలు 25 నుంచి 38కి పెరగనున్నాయి. కాగా.. ఈ సమాచారాన్ని కేంద్రం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు చెప్పింది.
Lok Sabha Seats Increase | ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు!
దేశంలో నియోజకవర్గాల సంఖ్య పెంపు బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదించనున్నట్లుగా సమాచారం. బిల్లు ఆమోదం పొందిన అనంతరం డీలిమిటేషన్ కమిషన్ (Delimitation Commission) ఏర్పాటు చేసి సీట్ల పెంపు చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది.
Lok Sabha Seats Increase | ప్రాథమిక జనాభా వివరాలతోనే..
2023లో ఆమోదించిన బిల్లు ప్రకారం 2034 నుంచి మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది. అయితే 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలనే నిబంధన ఉంది. జనగణన తర్వాత సీట్ల పెంపునకు అనుమతిస్తే ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య తేడా వచ్చే అవకాశం ఉందని.. దక్షిణాది పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ సగటున లోక్‌సభ, అసెంబ్లీ సీట్లు 50 శాతం పెంచాలని నిర్ణయించినట్లుగా సమాచారం. దీంతో అన్ని రాష్ట్రాలకూ రాజకీయ ప్రాతినిధ్యం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి..: GHMC Property Tax Dues | జీహెచ్‌ఎంసీ కఠిన చర్యలు.. బకాయిలపై ఉక్కుపాదం.. పలువురి ఆస్తుల స్వాధీనం

