అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Lok Sabha Speaker | లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla)పై విపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఓటింగ్ జరగకుండానే మూజువాణి ఓటింగ్‌తో తీర్మానాన్ని సభ తిరస్కరించింది.
స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ (Congress) సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాసం ప్రవేశ పెట్టాయి. ఈ తీర్మానంపై దాదాపు 10 గంటల చర్చ జరిగింది. బుధవారం సాయంత్రం వాయిస్ ఓటు ద్వారా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్యానెల్ స్పీకర్ జగదాంబిక పాల్ (Jagadambika Pal) ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నిరసనలు నినాదాలు చేస్తున్న సమయంలో అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని ప్రకటించారు.
Lok Sabha Speaker | సభ వాయిదా
తీర్మానంపై ఓటింగ్ కోసం ప్రతిపక్ష ఎంపీలు తమ స్థానాలకు తిరిగి వెళ్లాలని పాల్ కోరారు. అయితే విపక్ష సభ్యులు నిరసన కొనసాగించడంతో తీర్మానాన్ని వాయిస్ ఓటు ద్వారా తిరస్కరించారు. ఆ తర్వాత సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రతిపక్షంపై విమర్శలు చేశారు. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం తీసుకురావడం ద్వారా ప్రజాస్వామ్య పునాదినే ప్రశ్నిస్తున్నారని ఆరోపించారు.
Lok Sabha Speaker | సభా నియమాలు పాటించాలి

రాజ్యాంగం స్పీకర్‌కు మధ్యవర్తి పాత్రను ఇచ్చిందని షా గుర్తు చేశారు. సభ పనితీరు విశ్వాసం, నియమాలకు కట్టుబడి ఉండటంపై ఆధారపడి ఉంటుందన్నారు. స్పీకర్ అధికార పక్షం, ప్రతిపక్షం రెండింటికి ప్రాతినిధ్యం వహిస్తూ తటస్థ సంరక్షకుడిగా వ్యవహరిస్తారని చెప్పారు. స్పీకర్ సమావేశాలను ఎలా నిర్వహించాలో మార్గనిర్దేశం చేయడానికి ఈ లోక్‌సభ ద్వారా నిర్దిష్ట నియమాలు ఉన్నట్లు చెప్పారు. సభ్యులు దాని నియమాలు పాటించాలని ఆయన సూచించారు.
ఇది కూడా చదవండి : Lok Sabha No Confidence | లోక్‌సభ స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై చర్చ

