అక్షరటుడే, వెబ్‌డెస్క్: Lokesh Capgemini Meeting | క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్ (Cap Gemini CEO Ayman Izzat)తో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. విశాఖపట్నంలో డెవలప్మెంట్ సెంటర్, జీసీసీ ఏర్పాటు చేయాలని కోరారు.
ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)లో ఐటీ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా విశాఖను ఐటీ హబ్‌గా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు డేటా సెంటర్లు, సంస్థల ఏర్పాటు కోసం ఆయా పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), మంత్రులు సమావేశం అవుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా లోకేష్ క్యాప్ జెమినీ సీఈవోతో చర్చించారు.
Lokesh Capgemini Meeting | వేగంగా అభివృద్ధి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారథ్యంలో విశాఖపట్నం ఐటీ, డేటా సెంటర్ హబ్‌గా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని లోకేష్ అన్నారు. దేశంలోనే అతిపెద్దదైన గూగుల్ డేటా సెంటర్ (Google Data Center) పనులు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఇప్పటికే కాగ్నిజెంట్, టీసీఎస్ లాంటి సంస్థలు విశాఖలో ల్యాండ్ అయ్యాయని చెప్పారు. మరో మూడు నెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం అవుతుందని చెప్పారు. దేశంలో మరే ప్రాంతంలోని లేని ఐటీ ఎకో సిస్టమ్ (IT Ecosystem) విశాఖపట్నానికి మాత్రమే సొంతం అని లోకేష్ పేర్కొన్నారు.

Lokesh Capgemini Meeting | 20 వేల ఉద్యోగాలు
అన్ని అనుకూలతలు ఉన్న వైజాగ్‌లో 20వేల ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం గల ఐటీ డెవలప్‌సెంటర్, జీసీసీ, క్లౌడ్ సర్వీసెస్, బీపీఎం వర్టికల్స్ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్స్ ఏర్పాటు కోసం ఏపీ విశ్వవిద్యాలయాలతో కలిసి కో డెవలప్మెంట్ పార్టనర్‌గా వ్యవహరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లో క్వాంటం వ్యాలీ అభివృద్ధికి సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. క్యాప్ జెమినీ ఇండియా సీఈవో సంజయ్ చాకే, డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సీఈవో కేశవ్ మురుగేష్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Eluru Child Tragedy | ఏలూరులో చోటు చేసుకున్న తీవ్ర విషాదం.. కూల్‌డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగి చిన్నారి మృతి

