అక్షరటుడే, ఇందూరు : London Fire Incident | ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లిన జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు అక్కడ మృతి చెందాడు. అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ చనిపోయాడు
నగరంలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన కామినేని సాయిశ్రీకర్(26) లండన్ (London)లో ఎంఎస్ చదవడానికి వెళ్లాడు. అక్కడ చదువు పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. లండన్‌లోని క్రాయ్డన్ ప్రాంతంలో అద్దె ఇంటిలో అతడు ఉంటున్నాడు. ఈ క్రమంలో అతడు ఉంటున్న నివాసంలో మంగళవారం రాత్రి (ఫిబ్రవరి 24) భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కామినేని సాయి శ్రీకర్ (26) మూడు రోజుల పాటు చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశాడు.
London Fire Incident | తీవ్ర విషాదం
అగ్ని ప్రమాదంలో సాయి శ్రీకర్‌తో పాటు నివాసం ఉంటున్న ఏపీలోని కాకినాడ జిల్లా (Kakinada District) పెద్దాపురానికి చెందిన గొంతి అభిషేక్ (28) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ శ్రీకర్ మాత్రం ఆస్పత్రిలో చనిపోయాడు. మరో రూమ్‌మేట్ మంటల నుంచి బయటపడినా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా శ్రీకర్ మరణ వార్త తెలియడంతో ఆయన తల్లిదండ్రులు కామినేని ఆంజనేయ ప్రసాద్, పోకల రేణుక గుండెలవిసేలా రోదిస్తున్నారు. శ్రీనగర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన తల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Pakistan Afghanistan Airstrikes War | అఫ్గానిస్థాన్‌పై పాక్ యుద్ధం.. పలు నగరాలపై వైమానిక దాడులు

