అక్షరటుడే, న్యూఢిల్లీ: LPG Booking Rules | దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ (LPG) సిలిండర్ బుకింగ్ నిబంధనలు కఠినతరం అయ్యాయి. సరఫరాలో ఆలస్యం, పెరిగిన డిమాండ్ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు కొత్త మార్గదర్శకాలను జారీ చేశాయి. ఈ మార్పులు వినియోగదారులపై తీవ్రంగానే ప్రభావం చూపనున్నాయి.
LPG Booking Rules | కొత్త బుకింగ్ నిబంధనలు
తాజా మార్గదర్శకాలు ఇలా..
- డబుల్ సిలిండర్ ఉన్నవారు 35 రోజుల గ్యాప్‌తో రీఫిల్ బుకింగ్ చేసుకోవాలి.
- ఉజ్వల కనెక్షన్ ఉన్నవారికి 45 రోజుల తర్వాతే బుకింగ్‌కు అవకాశం.
- సింగిల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజుల తర్వాత బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- నిర్దేశిత గడువు కంటే ఒక్కరోజు ముందు బుక్ చేసుకున్నా.. సదరు బుకింగ్ ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది.
LPG Booking Rules | ఎందుకింత కఠిన నిర్ణయం?
దేశంలో ఇటీవల గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం, అంతర్జాతీయ మార్కెట్లో సరఫరాతోపాటు ఇంధన ధరల మార్పులు, రవాణా సమస్యల వంటి కారణాలు LPG వ్యవస్థపై ఒత్తిడి పెంచాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో భౌగోళిక ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల మార్పునకు ప్రధాన కారణం అయ్యాయి.
మరోవైపు, కొందరు వినియోగదారులు అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకోవడం కూడా సమస్యగా పరిణమించింది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. ఒక్కో గ్యాస్ ఏజెన్సీలో సాధారణంగా రోజుకు 300–400 బుకింగ్స్ ఉండేవి.. 2000 ల వరకు పెరిగాయి. దీనివల్ల నిజంగా గ్యాస్ అవసరమైన వారికి ఆలస్యం అవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు బుకింగ్ వ్యవస్థను నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సరఫరా సమతుల్యం..
ప్రతి వినియోగదారునికి నిర్ణీత సమయంలో గ్యాస్ అందేలా చూడటం, నిల్వలు సమతుల్యం చేయడం, దుర్వినియోగాన్ని నియంత్రించడం ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా సంస్థలు వెల్లడిస్తున్నాయి.
వినియోగదారులు పాటించాల్సిన సూచనలు
గ్యాస్ అవసరాన్ని ముందుగానే అంచనా వేసుకుని బుకింగ్ చేయాలి. చివరి నిమిషంలో బుకింగ్ చేసేందుకు ప్రయత్నిస్తే సమస్యలు తప్పవు.
ఇది కూడా చదవండి: LPG Price Hike | వంటింట్లో మంట.. డొమెస్టిక్ LPG ధర రూ.60 పెంపు.. వాణిజ్య సిలిండర్ రూ.115 పెరుగుదల!
ఇది కూడా చదవండి: LPG Supply Monitoring | ఎల్‌పీజీ కృత్రిమ కొరత.. సర్కారు కీలక నిర్ణయం.. ఇక పర్యవేక్షణ కట్టుదిట్టం!

