అక్షరటుడే, వెబ్డెస్క్ : LPG cylinder supply | గ్యాస్ సిలిండర్ల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎల్లుండి నుంచి రాష్ట్రాలకు 20 శాతం అదనంగా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తామని తెలిపింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో అంతరాయం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో కేంద్రం వాణిజ్య సిలిండర్ల (Commercial cylinders)పై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో అనేక హోటళ్లు మూతబడ్డాయి. తాజాగా పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ (Ministry of Petroleum and Natural Gas) ప్రకటన విడుదల చేసింది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 20 మార్చి 23 నుంచి అదనంగా మరో 20 శాతం గ్యాస్ సరఫరా చేస్తామని ప్రకటించింది. దీంతో గ్యాస్ కేటాయింపులు సంక్షోబానికి కంటే ముందు స్థాయిలలో 50 శాతానికి చేరనుంది. ఈ పెంచిన కేటాయింపుల లక్ష్యం కీలక రంగాలకు, ముఖ్యంగా ఆహార సరఫరా, ప్రజా సంక్షేమానికి సంబంధించిన వాటికి మద్దతు ఇవ్వడమేనని పెట్రోలియం కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ తెలిపారు.
LPG cylinder supply | వాణిజ్య సిలిండర్లు
యుద్ధం ప్రభావంతో వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రధాన నగరాల్లోని అనేక హోటళ్లు (Hotels), హాస్టళ్లు మూతబడ్డాయి. అదనపు కేటాయింపుల్లో రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లు, పారిశ్రామిక క్యాంటీన్లు, ఆహార ప్రాసెసింగ్/పాడి పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు నిర్వహిస్తున్న క్యాంటీన్లు/అవుట్‌లెట్‌లు, కమ్యూనిటీ కిచెన్‌లు సరఫరా చేయాలని కేంద్రం ఆదేశించింది. వలస కార్మికులకు 5 కేజీల ఎఫ్‌టీఎల్ (FTL) సిలిండర్ ఉచితంగా ఇవ్వాలని పేర్కొంది.
LPG cylinder supply | నమోదు చేసుకోవాలి
తాజాగా కేటాయించిన సిలిండర్లలో అర్హత పొందాలంటే వాణిజ్య, పారిశ్రామిక ఎల్‌పీజీ వినియోగదారులందరూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMC) వద్ద నమోదు చేసుకోవాలని కేంద్రం పేర్కొంది. మార్చి 19తో ముగిసిన వారంలో దేశ ఎల్‌పీజీ దిగుమతులు 265,000 టన్నులకు పడిపోయాయి. మార్చి 5 నాటి 322,000 టన్నుల నుంచి పశ్చిమ ఆసియా నుండి దిగుమతులు మార్చి 19తో ముగిసిన వారంలో కేవలం 89,000 టన్నులకు పడిపోయాయి. అయితే ప్రత్యామ్నాయ ప్రాంతీయ సరఫరాలు మార్చి 19తో ముగిసిన వారంలో 176,000 టన్నులకు పెరిగాయని, వీటిలో అధికభాగం అమెరికా నుంచే వచ్చాయని నివేదిక పేర్కొంది.

దీనిని కూడా చదవండి : Air India Flight Return | 8 గంటలు ప్రయాణించి తిరిగొచ్చిన విమానం.. ప్రయాణికులకు చేదు అనుభవం

