Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: LPG Price Hike | వంటింట్లో మంట.. డొమెస్టిక్​ LPG ధర రూ.60 పెంపు.. వాణిజ్య సిలిండర్ రూ.115 పెరుగుదల!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - LPG Price Hike | వంటింట్లో మంట.. డొమెస్టిక్​ LPG ధర రూ.60 పెంపు.. వాణిజ్య సిలిండర్ రూ.115 పెరుగుదల!

జాతీయంతాజా వార్తలు

LPG Price Hike | వంటింట్లో మంట.. డొమెస్టిక్​ LPG ధర రూ.60 పెంపు.. వాణిజ్య సిలిండర్ రూ.115 పెరుగుదల!

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు, Iran – Israel మధ్య నెలకొన్న ఘర్షణలు, United States జోక్యం నేపథ్యంలో భారత దేశంలో ఇంధన భద్రతపై కేంద్ర సర్కారు అప్రమత్తమైంది. ఎల్పీజీ (Liquefied petroleum gas – LPG) గ్యాస్ సరఫరాపై దేశవ్యాప్తంగా తాత్కాలిక ఆంక్షలు విధిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ వెంటనే గ్యాస్​ ధరలు పెరగడం గమనార్హం.

Naresh chandan
Last updated: మార్చి 7, 2026 9:32 ఉద.
Naresh chandan
3 వారాలు ago
Share
LPG Price Hike | వంటింట్లో మంట.. డొమెస్టిక్​ LPG ధర రూ.60 పెంపు.. వాణిజ్య సిలిండర్ రూ.115 పెరుగుదల!
LPG Price Hike | వంటింట్లో మంట.. డొమెస్టిక్​ LPG ధర రూ.60 పెంపు.. వాణిజ్య సిలిండర్ రూ.115 పెరుగుదల!

అక్షరటుడే, న్యూఢిల్లీ: LPG Price Hike | భారత్​లో గృహ వినియోగదారులకు మరోసారి గ్యాస్ ధరలు షాక్ ఇచ్చాయి. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరను కేంద్ర సర్కారు పెంచింది. మార్చి 7వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా నూతన ధరలు అమల్లోకి వచ్చాయి.

Contents
  • LPG Price Hike | ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు
    • LPG Price Hike | అంతర్జాతీయ మార్కెట్..

కేంద్రం నిర్ణయం ప్రకారం.. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ (Domestic LPG Cylinder) ధరపై రూ.60 పెంచారు. అదే సమయంలో కమర్షియల్ సిలిండర్ ధరను రూ.115 వరకు పెంచారు. ఈ ధరల పెంపు వెంటనే అమల్లోకి వచ్చినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి.

LPG Price Hike | ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు

దేశంలోని ప్రధాన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు Indian Oil Corporation, Bharat Petroleum, Hindustan Petroleum కొత్త ధరల జాబితాను ప్రకటించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన, ముడి చమురు ధరల మార్పులు, దిగుమతి వ్యయాల పెరుగుదల తదితర అంశాల ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నాయి.

తాజా ధరల పెంపుతో గృహ వినియోగదారులపై అదనపు భారం తప్పడంలేదు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. తాజాగా గ్యాస్ ధరలు కూడా పెరగడం సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక రెస్టారెంట్లు, హోటళ్లు, చిన్న వ్యాపారాలు ఉపయోగించే కమర్షియల్ సిలిండర్ ధర సైతం పెరగడంతో వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాపారులు వాపోతున్నారు.

LPG Price Hike | అంతర్జాతీయ మార్కెట్..

అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను బట్టి ప్రతి నెల ఆయిల్ కంపెనీలు ఎల్పీజీ ధరలను సమీక్షిస్తాయి. ఇదే ప్రక్రియలో భాగంగా తాజాగా ధరలు పెంచినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇక ఆయా నగరాల్లో స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల వంటి అంశాల నేపథ్యంలో స్థానికంగా సిలిండర్ ధరలు కొద్దిగా మారవచ్చని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. కొత్త ధరలతో గృహ వినియోగదారులు, వ్యాపార సంస్థలు తమ నెలవారీ బడ్జెట్​ను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Tilak Finger | బొట్టు పెట్టే వేలిని బట్టి తలరాత.. తిలకం దిద్దే విధానం వెనుక షాకింగ్ నిజాలు!
Iran US Embassy Attack | అమెరికా ఎంబసీపై ఇరాన్​ దాడి
Nizamabad Bus Accident | రక్తమోడిన జాతీయ రహదారి.. అతివేగం – నిద్ర మత్తు కారణమా.. క్షతగాత్రులకు జీజీహెచ్​లో చికిత్స
Junk Food Cravings | జంక్ ఫుడ్ తింటున్నారా.. అయితే ఈ డేంజర్ బెల్స్ మీకోసమే!
India Economic Resilience | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఆర్థిక బఫర్లతో భారత్ సేఫ్!
TAGGED:commercial LPG cylindercooking gas price hikedomestic gas cylinder priceLPG cylinder ratesLPG news IndiaLPG price hikeLPG price Indiaoil marketing companies India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Vijayawada Temple Theft | విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో భారీ చోరీ.. భక్తురాలి బ్యాగ్ నుంచి రూ.50 లక్షల బంగారం మాయం! Vijayawada Temple Theft | విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో భారీ చోరీ.. భక్తురాలి బ్యాగ్ నుంచి రూ.50 లక్షల బంగారం మాయం!
Next Article Allu Sirish Marriage Allu Sirish Marriage | ప్రేయ‌సితో ఏడ‌డుగులు వేసిన అల్లు శిరీష్‌.. సంద‌డి చేసిన మెగా ఫ్యామిలీ
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?