అక్షరటుడే, హైదరాబాద్: LPG Supply Monitoring | ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా వ్యవస్థను పర్యవేక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
LPG Supply Monitoring | రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు
ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి సమస్య లేకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ కమిటీలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గ్యాస్ సరఫరా పరిస్థితి, వినియోగదారులకు అందిస్తున్న సేవలు, ఏజెన్సీల పనితీరును సమీక్షించడం ఈ కమిటీల ప్రధాన లక్ష్యం.
LPG Supply Monitoring | కృత్రిమ కొరతపై ఉక్కుపాదం
కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల కొరత ఉందనే ఫిర్యాదులు రావడంతో సర్కారు అప్రమత్తమైంది. కొంతమంది డీలర్లు కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ సరఫరా వ్యవస్థను కట్టుదిట్టంగా పర్యవేక్షించేందుకు తెలంగాణ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫిర్యాదులు చేస్తే..
జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే కమిటీలు స్థానికంగా ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాల్సి ఉంటుంది. గ్యాస్ సిలిండర్ బుకింగ్, సరఫరా ఆలస్యం, అధిక వసూళ్ల వంటి అంశాలపై వినియోగదారులు ఫిర్యాదు చేస్తే వెంటనే విచారణ చేపట్టే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

పారదర్శక సరఫరా..
ఈ కమిటీల పర్యవేక్షణతో ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అవసరమైన ప్రాంతాలకు సరిపడా సిలిండర్లు అందించేలా చర్యలు తీసుకోవడం, వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చూడటం సర్కారు లక్ష్యమని పేర్కొంటున్నారు.The government has constituted committees at the state and district levels to monitor the supply of LPG cylinders.

