అక్షరటుడే, వెబ్డెస్క్: Macharla Rape Case | ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా మాచర్ల లో అత్యంత ఘోరమైన ఘటన వెలుగుచూసింది. ఢిల్లీ నిర్భయ, హైదరాబాద్ దిశ కేసులను తలపించే ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగినిపై అమానుషంగా అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, రాక్షసత్వంతో వ్యవహరించాడు.
Macharla Rape Case | దాహం పేరిట ఇంట్లోకి చొరబడి..
బాధితురాలు మాచర్ల పట్టణంలో ఒక ప్రభుత్వ శాఖలో పనిచేస్తారు. తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఇది గమనించిన దుండగుడు, పథకం ప్రకారం.. ఆమె ఇంట్లోకి దూరాడు. తనకు దాహంగా ఉందని, మంచినీళ్లు ఇవ్వాలని కోరడంతో మానవత్వంతో ఆమె నీళ్లు తెచ్చేలోపే దుండగుడు లోపలికి ప్రవేశించి తలుపులు మూసి గడియ పెట్టాడు.
Macharla Rape Case | కత్తితో బెదిరింపు.. రాక్షసంగా అత్యాచారం
లోపలికి ప్రవేశించిన ఆగంతకుడు ఒక్కసారిగా తన వద్ద ఉన్న కత్తిని బయటకు తీసి బెదిరించాడు. ప్రతిఘటించిన బాధితురాలిని విచక్షణారహితంగా కొట్టాడు. అనంతరం దారుణంగా అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
HIV ఉందని చెప్పినా వదలని వైనం!
నిందితుడి నుంచి తనను తాను కాపాడుకునేందుకు, తనకు HIV (ఎయిడ్స్) ఉందని బాధితురాలు చెప్పింది. అయినా, ఆ మృగాడిలో మార్పు రాలేదు సదా సరికదా.. మరింత రెచ్చిపోయాడు. ఆమెపై ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. దీంతో బాధితురాలు తీవ్ర రక్తస్రావంతో స్పృహ కోల్పోయింది.
పోలీసుల దర్యాప్తు..
సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Bellamkonda Sreenivas Wedding | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి డేట్ ఫిక్స్.. వేదిక ఎక్కడంటే!
