Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Mahindra BE6 Batman Edition | ధర పెరిగినా ‘బ్యాట్‌మాన్’కు తగ్గని డిమాండ్.. ఏడు నిమిషాల్లోనే సోల్డ్ ఔట్!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Mahindra BE6 Batman Edition | ధర పెరిగినా ‘బ్యాట్‌మాన్’కు తగ్గని డిమాండ్.. ఏడు నిమిషాల్లోనే సోల్డ్ ఔట్!

బిజినెస్​తాజా వార్తలు

Mahindra BE6 Batman Edition | ధర పెరిగినా ‘బ్యాట్‌మాన్’కు తగ్గని డిమాండ్.. ఏడు నిమిషాల్లోనే సోల్డ్ ఔట్!

భారతీయ ఆటోమొబైల్ రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తన బీఈ6 బ్యాట్‌మాన్ ఎడిషన్ కోసం మరోమారు బుకింగ్స్ ప్రారంభించింది.

Srinivas kolluri
Last updated: మార్చి 11, 2026 6:11 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Mahindra BE6 Batman Edition

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mahindra BE6 Batman Edition | దేశీయ ఆటోమొబైల్ రంగ దిగ్గజ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) తన ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. పరిమిత సంఖ్యలో విడుదల చేసిన ‘బీఈ 6 బ్యాట్‌మాన్ ఎడిషన్’ కోసం వాహన ప్రియులు ఎగబడ్డారు. గత ఎడిషన్ కన్నా ఈసారి ధర పెంచినా.. ఏ మాత్రం డిమాండ్ తగ్గకపోవడం గమనార్హం. బుకింగ్స్ ప్రారంభించిన ఏడు నిమిషాల్లోనే అన్ని యూనిట్లూ అమ్ముడయ్యాయి.

Contents
  • Mahindra BE6 Batman Edition | అయినా డిమాండ్ తగ్గకపోవడం గమనార్హం
    • Mahindra BE6 Batman Edition | ఎక్స్‌టీరియర్..
      • Mahindra BE6 Batman Edition | ఇంటీరియర్..

Mahindra BE6 Batman Edition | అయినా డిమాండ్ తగ్గకపోవడం గమనార్హం

మహీంద్రా బీఈ 6 (Mahindra BE6)కి సంబంధించి ఇది రెండో బ్యాచ్. మొదటి బ్యాచ్‌లో 300 యూనిట్లను మాత్రమే విక్రయించాలని భావించినా తర్వాత దానిని 999 యూనిట్లకు పెంచారు. అయినప్పటికీ క్షణాల్లో అమ్ముడయ్యాయి. డిమాండ్ కారణంగా ఉత్పత్తి పెంచి బుకింగ్‌ను తిరిగి ప్రారంభించారు. రెండో బ్యాచ్‌లో ఎక్స్ షోరూం ధరను రూ. 70 వేలు పెంచి, రూ. 28.49 లక్షలుగా నిర్ణయించారు. అయినా డిమాండ్ తగ్గకపోవడం గమనార్హం. మంగళవారం బుకింగ్ విండో తెరిచిన ఏడు నిమిషాల్లోనే 999 యూనిట్లు పూర్తిగా అమ్ముడయ్యాయని కంపెనీ అధికారికంగా ధ్రువీకరించింది. డెలివరీలు ఏప్రిల్ 10న మొదలవుతాయని పేర్కొంది. ఫీచర్లు ఇలా ఉన్నాయి.

Mahindra BE6 Batman Edition | ఎక్స్‌టీరియర్..

కారు బాడీకి ‘సాటిన్ బ్లాక’ ఫినిషింగ్ ఇచ్చారు. బ్యాట్‌మాన్ గ్రాఫిక్స్, థీమ్ బ్యాడ్జింగ్‌ను జోడించారు. 20 ఇంచ్‌ల భారీ అల్లాయ్ వీల్స్ ఈ కారుకు అగ్రెసివ్ లుక్‌ను ఇస్తున్నాయి.

లోగోలు : ‘ది డార్క్ నైట్’ ట్రయాలజీలో కనిపించే ప్రసిద్ధ ‘బ్యాట్ ఎంబ్లమ్’ను హబ్ క్యాప్స్, ఫ్రంట్ క్వార్టర్ ప్యానెల్స్, రియర్ బంపర్, విండోస్, రియర్ విండ్‌షీల్డ్‌పై ప్రత్యేకంగా అమర్చారు. ఇన్ఫినిటీ రూఫ్‌పై బ్యాట్ ఎంబ్లెమ్, రాత్రి వేళల్లో లోగోను నేలపై ప్రొజెక్ట్ చేసే ‘నైట్ ట్రైల్’ కార్పెట్ ల్యాంప్స్, వెనుక డోర్ క్లాడింగ్‌పై బ్యాట్‌మాన్ సిగ్నేచర్ స్టిక్కర్ వంటివి ప్రత్యేకంగా నిలుపుతాయి.

Mahindra BE6 Batman Edition | ఇంటీరియర్..

కారు లోపలి భాగం పూర్తి నలుపు థీమ్‌తో నిండిపోయింది. డాష్‌బోర్డ్‌పై ఆల్కెమీ గోల్డ్‌లో నంబర్ ఉన్న బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ప్లేక్, డ్రైవర్ కాక్‌పిట్ చుట్టూ బ్రష్డ్ గోల్డ్ హలో, గోల్డ్ యాక్సెంట్ ఉన్న స్టీరింగ్ వీల్, కస్టమ్ కీ ఫోబ్ వంటివి లగ్జరీ లుక్‌ను ఇచ్చాయి.
సూయిడ్, లెదర్ అప్‌హోలిస్ట్రీపై గోల్డ్ సెపియా స్టిచింగ్, సీట్లపై బ్యాట్ ఎంబ్లమ్ ఎంబోసింగ్ ఉండడంతో లోపల కూర్చున్నప్పుడు మంచి అనుభూతి కలుగుతుంది.

భద్రత ఫీచర్లు :7 ఎయిర్‌బ్యాగులు, ఐఎస్‌వోఎఫ్ఐఎక్స్ చైౖల్డ్ సీట్ యాంకరేజ్‌లు, అన్ని వీల్స్‌పై డిస్క్ బ్రేక్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో పార్క్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్(టీపీఎంఎస్) మరియు 360 డిగ్రీ కెమెరా ఉన్నాయి. లేన్ కీప్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ వంటి లక్షణాలతో కూడిన లెవల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ (ఏడీఏఎస్) సూట్ కూడా ఇచ్చారు.

రేంజ్ : ఇందులో 79 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 286 హార్స్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. రియర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 682 కి.మీ (క్లెయిమ్డ్ రేంజ్) వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.

ఇది కూడా చదవండి..: March 11 Gold Prices | ఒక్క రోజులోనే రూ.700 ఎగ‌బాకిన బంగారం ధ‌ర‌.. వెండి ఏకంగా రూ.10 వేల హైక్​

Adulterated Ginger Garlic Paste | అసిటిక్ యాసిడ్ – గమ్ పౌడర్​తో అల్లం–వెల్లుల్లి పేస్ట్​ తయారీ.. రెండు టన్నుల కల్తీ సరకు పట్టివేత!
March 17 Gold Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెళ్లిళ్ల సీజన్ ముందు మధ్యతరగతికి కాస్త ఊరట
Shiv Pratap Shukla Governor | గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం
Stock Market Crash | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. భారీ నష్టాల్లో సూచీలు..
Arunachalam Train Services | రెగ్యులర్​ సర్వీస్​గా నాంపల్లి – కన్యాకుమారీ వీక్లీ ఎక్స్​ప్రెస్​
TAGGED:batman edition carelectric car india newsEV Market IndiaMahindra and Mahindramahindra auto newsMahindra BE6Mahindra BE6 Batman Editionmahindra be6 bookingsmahindra electric suv
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Punjab Sind Bank Branch Punjab Sind Bank Branch | బ్యాంకు సేవలను వినియోగించుకోవాలి
Next Article Jhansi Cylinder Theft Case Jhansi Cylinder Theft Case | సిలిండర్ల లారీ దొంగతనం కేసు.. ఛేదించిన ఝాన్సీ పోలీసులు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?