Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Mahindra XUV 9E CineLux | లగ్జరీ ఫీచర్లతో ‘సినీలక్స్’ లాంచ్.. బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Mahindra XUV 9E CineLux | లగ్జరీ ఫీచర్లతో ‘సినీలక్స్’ లాంచ్.. బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా

బిజినెస్​తాజా వార్తలు

Mahindra XUV 9E CineLux | లగ్జరీ ఫీచర్లతో ‘సినీలక్స్’ లాంచ్.. బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా

మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎక్సఈవీ 9ఇ కారును స్పెషల్ ఎడిషన్ రూపంలో ‘సినీలక్స్’ పేరుతో లాంచ్ చేసింది.

Srinivas kolluri
Last updated: మార్చి 2, 2026 12:51 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Mahindra XUV 9E CineLux
Mahindra XUV 9E CineLux

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mahindra XUV 9E CineLux | మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra) తన ప్రతిష్టాత్మక ‘ఎలక్ట్రిక్ ఆరిజిన్’ ఎస్‌యూవీలో ప్రత్యేకమైన ‘ఎక్స్ఈవీ 9ఇ సినీలక్స్ ఎడిషన్’ను విడుదల చేసింది. లగ్జరీని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో మిళితం చేస్తూ రూపొందించిన ఈ ఎడిషన్.. అత్యున్నత స్థాయి సౌకర్యాన్ని, అద్భుతమైన అనుభూతిని అందిస్తుందని భావిస్తున్నారు.

Contents
  • Mahindra XUV 9E CineLux | ఇంటీరియర్ ఫీచర్స్..
  • Mahindra XUV 9E CineLux | కలర్ వేరియంట్స్..
    • Mahindra XUV 9E CineLux | టెక్నాలజీ ఫీచర్లు..

ప్రత్యేకమైన ఫినిషింగ్, ప్రీమియం ఇంటీరియర్స్, హైఎండ్ ఫీచర్లతో కూడిన ఈ ఎడిషన్.. స్టాండర్డ్ ఎక్స్ఈవీ 9ఇ శక్తివంతమైన పనితీరు, రేంజ్‌ను కొనసాగిస్తూనే మరింత విలాసవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కారు బుకింగ్స్ మార్చి 2న ప్రారంభమయ్యాయి. మార్చి 10 నుంచి డెలివరీ ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. ఫీచర్లు ఇలా ఉన్నాయి.

Mahindra XUV 9E CineLux | ఇంటీరియర్ ఫీచర్స్..

మహీంద్రా ఎక్స్ఈవీ 9ఇ సినీలక్స్ ఎడిషన్ లోపలి భాగం చెస్ట్‌నట్ బ్రౌన్, నోక్టర్న్ బ్లాక్ రంగుల స్మూత్ గ్రెయిన్ లెదరెట్ ఫినిషింగ్‌తో విలాసవంతమైన లాంజ్ లాగా అనిపిస్తుంది.

డిస్‌ప్లే : డ్యాష్‌బోర్డ్ అంతటా విస్తరించి ఉన్న ‘కోస్ట్ టు కోస్ట్’ ట్రిపుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
ఆడియో : డాల్బీ అట్మాస్ సౌకర్యం గల 16 స్పీకర్ల హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్ అద్భుతమైన సౌండ్ అనుభవాన్ని ఇస్తుంది.
లైటింగ్ : ఇన్ఫినిటీ రూఫ్, యాంబియంట్ లైటింగ్ సిస్టమ్ ఉన్నాయి.

Mahindra XUV 9E CineLux | కలర్ వేరియంట్స్..

శాటిన్ బ్లాక్, శాటిన్ వైట్ రంగుల్లో లభిస్తుంది. ఈ ఫినిషింగ్‌లు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి మరింత ప్రీమియం రూపాన్ని ఇచ్చాయి.రెండు ఇంటీరియర్ థీమ్స్ పొందుతుంది. ఇది టాప్ స్పెక్ ప్యాక్ త్రీ వేరియంట్‌లోని దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది.

Mahindra XUV 9E CineLux | టెక్నాలజీ ఫీచర్లు..

ప్యాక్ త్రీ వేరియంట్ నుంచి ప్రేరణ పొందిన ఈ ఎడిషన్‌లో ‘స్ట్రైట్ అహెడ్ విజన్ ఎక్స్’ (ఏఆర్ హెడ్స్ అప్ డిస్‌ప్లే), ఐడెంటిటీ (డ్రైవర్, ప్యాసింజర్ మానిటరింగ్), హ్యాండ్స్ ఫ్రీ పార్క్ అసిస్ట్, 360 డిగ్రీల కెమెరా అండ్ ఆటో పార్క్ అసిస్ట్‌తో ఏడీఏఎస్ మొదలైన సౌకర్యాలు ఈ కారులో ఉన్నాయి. వీటితో పాటు క్యాంప్, కీప్, పాపాల్ హెచ్‌వీఏసీ మోడ్‌లు, డిజిటల్ కీ, పర్సనలైజ్డ్ యూజర్ ప్రొఫైల్స్ వంటి ఆధునిక సౌకర్యాలున్నాయి.

బ్యాటరీ : సినీలక్స్ ఎడిషన్ 79 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 500 కి.మీ. రేంజ్‌ను అందిస్తుంది. 282 బీహెచ్పీ, 380 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది. కాబట్టి పనితీరు కూడా బాగుంటుందని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Gold Silver Prices | అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు

Black Monday to Stock Market | స్టాక్ మార్కెట్‌లో బ్లాక్ మండే.. రూ. 7.25 లక్షల కోట్ల సంపద ఆవిరి
Gas Cylinder Booking | గ్యాస్​ సిలిండర్​ బుకింగ్​ గడువు 45 రోజులకు పెంపు
Adulterated Ginger Garlic Paste | అసిటిక్ యాసిడ్ – గమ్ పౌడర్​తో అల్లం–వెల్లుల్లి పేస్ట్​ తయారీ.. రెండు టన్నుల కల్తీ సరకు పట్టివేత!
Tirumala Darshan Rules | తిరుమల భక్తులకు అలెర్ట్​.. శ్రీవారి దర్శనానికి కఠిన నిబంధన!
Gold Pink Paper | బంగారానికి గులాబీ రంగు కాగితం.. ఈ సంప్రదాయం వెనుక ఉన్న రహస్యం తెలుసా!
TAGGED:Advanced tech SUVElectric SUV IndiaEV with 500 km rangeLuxury electric carMahindra bookingsMahindra CineLux editionMahindra XUV 9E CineLuxPremium SUV features
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Free Bus Travel Free Bus Travel | దివ్యాంగులకు గుడ్​న్యూస్​.. ఉచితంగా బస్సు ప్రయాణం
Next Article Fino Bank CEO Arrest Fino Bank CEO Arrest | ఫినో బ్యాంక్​ సీఈవోకు రిమాండ్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?