Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Maize MSP Demand | ఎర్రజొన్న, మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: ఏఐయూకేఎస్​ డిమాండ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Maize MSP Demand | ఎర్రజొన్న, మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: ఏఐయూకేఎస్​ డిమాండ్​

నిజామాబాద్

Maize MSP Demand | ఎర్రజొన్న, మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: ఏఐయూకేఎస్​ డిమాండ్​

ఎర్రజొన్న, మొక్కజొన్న పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, కార్యదర్శి దేవారం డిమాండ్​ చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 12, 2026 2:58 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Maize MSP Demand

అక్షరటుడే, ఆర్మూర్ : Maize MSP Demand | ఎర్రజొన్న, మొక్కజొన్న పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, కార్యదర్శి దేవారం డిమాండ్​ చేశారు. పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

Contents
  • Maize MSP Demand | ఎంఎస్​పీ చెల్లించకుండా వ్యాపారులు..
    • Maize MSP Demand | ఎగుమతులు నిలిచిపోయాయని సాకులు చెబుతూ..
      • Maize MSP Demand | వాణిజ్య ఒప్పందం రైతులకు వ్యతిరేకం..

Maize MSP Demand | ఎంఎస్​పీ చెల్లించకుండా వ్యాపారులు..

మొక్కజొన్నకు ఎంఎస్​పీ చెల్లించకుండా వ్యాపారులు కృత్రిమంగా రూ.1,600 చొప్పున కొనుగోలు చేస్తున్నారని, అంతేకాకుండా ఆర్మూర్​ (Armoor) ప్రాంతంలో వ్యాపారులు బైబ్యాక్​ ఒప్పందాన్ని సైతం ఉల్లంఘిస్తూ ఎర్రజొన్నల ధరను క్వింటాల్​కు రూ.800 నుంచి రూ.1000కు తగ్గించి కొనుగోలు చేస్తున్నారన్నారు. వ్యాపారులపై చర్య తీసుకుని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్​కు విజ్ఞాపన పత్రాలు సమర్పించామన్నారు.

Maize MSP Demand | ఎగుమతులు నిలిచిపోయాయని సాకులు చెబుతూ..

ఎర్రజొన్నల ఎగుమతులు నిలిచిపోయాయని వ్యాపారులు ఒకసాకు చూపించి క్వింటాలకు రూ.800 నుండి రూ.1,000 కృత్రిమంగా ధర తగ్గించారన్నారు. రైతులకు రూ.వేలల్లో నష్టం చేసేవిధంగా వ్యాపారుల చర్యలు ఉన్నాయని వీరిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్న సందర్భంలో సైతం ఎర్రజొన్నను తామే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం మొక్కజొన్న, ఎర్రజొన్నను రూ.4వేల చొప్పున కొనుగోలు చేయాలని, డిమాండ్ చేశారు. మోడీ సర్కార్ (Modi Government) అధికారంలో రాకముందు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేసి రెండింతల ఆదాయం తెచ్చి పెడతానని కోతలు కోసిన మోదీ ఇప్పుడు కార్పొరేట్ భజన చేస్తున్నారని ఎంఎస్​పీ అమలు చేయకుండా నీరుగారుస్తున్నారని ఎద్దేవా చేశారు.

Maize MSP Demand | వాణిజ్య ఒప్పందం రైతులకు వ్యతిరేకం..

వాణిజ్య ఒప్పందం (Trade Agreement) రైతు వ్యతిరేకంగా ఉందని దీని రద్దు చేయాలని స్వామినాథన్​ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టర్ చొరవ తీసుకొని వ్యాపార, రైతు, రైతు సంఘాల ప్రతినిధులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో.. నిజామాబాద్ (Nizamabad) రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి బి కిషన్, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు ఆకుల గంగారాం, ఉపాధ్యక్షులు రాజన్న, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Mohan Reddy Funeral | పాడే మోసిన షబ్బీర్ అలీ.. ముగిసిన మాజీ జడ్పీటీసీ అంత్యక్రియలు

Owaisi Brothers Home Department | రాష్ట్రంలో ఒవైసీ బ్రదర్స్ చేతిలో హోంశాఖ: బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Fee Reimbursement Funds | బడ్జెట్​లో ఫీజుల కోసం రూ.15వేల కోట్లు కేటాయించాలి: బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు
Prajapalana Pragathi Pranalika | ప్రగతి ప్రణాళికలో అందరినీ భాగస్వామ్యులను చేయాలి
Gas Cylinder Explosion | గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలికి తీవ్రగాయాలు
LPG Cylinders Seized | కామారెడ్డిలో 31 ఎల్పీజీ సిలిండర్లు స్వాధీనం
TAGGED:ArmoorMaize MSP DemandModi GovernmentNizamabadTrade Agreement
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Car Accident Car Accident | కాలువలోకి దూసుకెళ్లిన కారు.. యువకుడి దుర్మరణం
Next Article Retired Employees Benefits Retired Employees Benefits | రిటైర్డ్​ ఉద్యోగులకు బెనిఫిట్స్​ చెల్లించాలి : హరీశ్​రావు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?