అక్షరటుడే, ఇందూరు: Maize Procurement Centers | నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లో రైతులు పండించిన మక్కపంటకు సంబంధించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు. ఈ మేరకు కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi)కి ఆయన లేఖ రాశారు.
Maize Procurement Centers | జిల్లాలో పెద్దఎత్తున మక్కదిగుబడి..
జిల్లాలో ఈ ఏడాది పెద్ద ఎత్తున మక్క సాగు జరిగిందని ఎంపీ అన్నారు. అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ఆలస్యం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) మక్కకు కనీస మద్దతు ధర (MSP) రూ.2,400 ప్రకటించినప్పటికీ, కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాల్‌కు రూ.1,700 నుంచి రూ.1,800 వరకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

Maize Procurement Centers | నష్టపోతున్న రైతులు..
తక్కువ ధరకు అమ్ముకోవడం వల్ల ప్రతి రైతు సగటున రూ.20,000 నుండి రూ.25,000 వరకు నష్టపోతున్నారని ఎంపీ (MP Dharmapuri Arvind) తెలిపారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి మక్కను మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆయన కోరారు. అలాగే రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి, మక్క కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన ప్రారంభించాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి సూచించారు.
ఇది కూడా చదవండి..: RSS Ugadi Utsavam | 19న ఆర్ఎస్ఎస్ ఉగాది ఉత్సవం

