అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Mala Sangham elections | నగరంలోని (Nizamabad) పోచమ్మగల్లీ మాల సంఘం కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. సభ్యులు సమావేశం అయి కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు.
Mala Sangham elections | అధ్యక్షుడిగా రాజేశ్
సంఘం అధ్యక్షుడిగా తార్ల రాజేశ్, ఉపాధ్యక్షుడిగా నంది హరిన్, సెక్రెటరీగా తార్ల రమేశ్, కోశాధికారిగా ఎడ్ల పవన్‌కుమార్, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎడ్ల ధన్‌రాజ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. మాలల హక్కుల కోసం పోరాడుతామన్నారు. మాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కొత్తగా ఎన్నికైన వారికి పలువురు సన్మానం చేసి, శుభాకాంక్షలు తెలిపారు. మాల సంఘం బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు.

దీనిని కూడా చదవండి : Five People Arrest | ఐదుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

