అక్షరటుడే, భీమ్‌గల్: Manala Mohan Reddy | గిరిజన తండాల సర్వతోముఖాభివృద్ధికి ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సహకార యూనియన్(State Cooperative Union) లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి (Manala Mohan Reddy) సూచించారు. భీమ్‌గల్ మండలంలోని రహత్ నగర్ గ్రామంలో సేవాలాల్ మహరాజ్(Sevalal Maharaj Jayanti) 287వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘భోగ్ బండారు’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
Manala Mohan Reddy | రూ.50 వేల విరాళం
బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహరాజ్ ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి, సుమారు 500 తండాలు తిరుగుతూ గిరిజనుల అభ్యున్నతికి కృషి చేశారని మానాల కొనియాడారు. ఆయన త్యాగనిరతిని స్మరించుకుంటూ, పార్టీలకు అతీతంగా ఈ ఉత్సవాలను వారం రోజుల పాటు నిర్వహించుకోవాలన్నారు. ఈ వేడుకల నిర్వహణకు నియోజకవర్గ కమిటీని ఏర్పాటు చేయాలని సూచిస్తూ, తన వంతుగా రూ.50వేల విరాళాన్ని ప్రకటించారు.
Manala Mohan Reddy | విద్య, సంక్షేమానికి పెద్దపీట
ప్రాంతీయ అభివృద్ధిలో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ (Integrated School Project) ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పీసీసీ (Pcc Telanagana) అధ్యక్షుడు మహేష్ గౌడ్ కృషితో ఈ పాఠశాల మంజూరైందని, దీనివల్ల గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు.
ప్రభుత్వ పథకాలపై భరోసా..
గతంలో వ్యవసాయ విద్యుత్ బిల్లులు(Telangana Politics) మాఫీ అయితే, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గృహ విద్యుత్ బిల్లులను మాఫీ చేసి పేదలకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. త్వరలోనే కొత్త పింఛన్లు మంజూరు చేసి, నెలకు రూ.4,000 అందజేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది ఈ ఉత్సవాలను 5,000 మందితో మరింత వైభవంగా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
ఉత్సాహంగా సాంస్కృతిక ప్రదర్శనలు
వేడుకల్లో భాగంగా గిరిజన చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతి, ఉప సర్పంచ్ సేవాలాల్, వీడీసీ అధ్యక్షుడు గోపాల్ నాయక్, భీమ్‌గల్ మున్సిపల్ ఛైర్ పర్సన్ బొదిరే నాగమణి, తహశీల్దార్ మహమ్మద్ షబ్బీర్, ఎంపీడీవో సంతోష్ కుమార్, వివిధ విభాగాల అధికారులు, బంజారా నాయకులు మరియు గ్రామస్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.


