అక్షరటుడే, వెబ్డెస్క్: Mangalhat Cordon Search | హైదరాబాద్ నగరంలోని మంగళహాట్లో పోలీసులు (Mangalhat Police) శనివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు.
నేరస్తులు, పత్రాలు లేని వాహనాలను పట్టుకోవడానికి పోలీసులు కార్డన్ సెర్చ్ (Cordon Search) నిర్వహిస్తుంటారు. సాధారణంగా ఇలాంటి సమయంలో పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తారు. అలాగే ప్రజలకు అవగాహన కల్పిస్తారు. పాత నేరస్తులకు కౌన్సెలింగ్ ఇస్తారు. తాజాగా మంగళహాట్లో మాత్రం పెద్ద ఎత్తున సిలిండర్లు స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
Mangalhat Cordon Search | గ్యాస్ కొరతతో..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతతో గ్యాస్ కొరత నెలకొంది. బుక్ చేసిన చాలా రోజుల వరకు సిలిండర్లు రావడం లేదు. మరోవైపు కమర్షియల్ సిలిండర్లు దొరకడం లేదు. దీంతో కొందరు సిలిండర్లను బ్లాక్ మార్కెట్ (Black Market)కు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో డీసీపీ చంద్రమోహన్ (DCP Chandramohan) ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు జుంగూరు బస్తి, దూల్‌పేట్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 111 గ్యాస్ సిలిండర్లు, 50 లీటర్ల మద్యం, పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: She Nethra Teams | మహిళల భద్రతకు చర్యలు.. షీ నేత్ర బృందాల ఏర్పాటు
